ముమ్మిడివరంలో ఘనంగా ‘సహజ రైతు సదస్సు’ –

June 19, 2026 | ఆంధ్రప్రదేశ్

ప్రకృతి వ్యవసాయం వైపు అన్నదాతల అడుగులు!

జనం న్యూస్ జూన్ 19 (ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ) డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరంలో ఆంధ్రప్రదేశ్ బిజెపి రాష్ట్ర అధ్యక్షులు పి.వి.ఎన్.మాధవ్ వారి ఆదేశాల తో,కిసాన్ మోర్చ రాష్ట్ర అధ్యక్షులు చిగురుపాటి కుమారస్వామి ఆదేశాల మేరకు,జిల్లా బిజెపి అధ్యక్షులు అడబాల సత్యనారాయణ వారు సూచనలతో,జిల్లా కిసాన్ మోర్చ అధ్యక్షులు చింతా తమ్మిరెడ్డి వారి అధ్యక్షతన నిర్వహించిన సహజ రైతు సదస్సు,సేంద్రీయ వ్యవసాయదారుల కార్యశాల సమావేశం విజయవంతంగా జరిగింది.ఈ సమావేశంలో సహజ సేంద్రీయ వ్యవసాయం మరియు ప్రకృతి ఆధారిత సాగు విధానాలపై రైతులకు అవగాహన కల్పించబడింది.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన రాష్ట్ర బిజెపి అధికార ప్రతినిధి ముళ్ళపూడి రేణుక చౌదరి జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించి,ప్రసంగించారు.ప్రధాని మోదీ రసాయన ఆధారిత వ్యవసాయం నుండి రైతులను సేంద్రీయ,ప్రకృతి ఆధారిత వ్యవసాయం వైపు ప్రోత్సహిస్తున్నారని, సేంద్రీయ, ప్రకృతి వ్యవసాయం కోసం అనేక పథకాలు ప్రవేశపెట్టి రసాయన ఎరువులు, పురుగుమందుల వినియోగాన్ని తగ్గించి, ప్రకృతి సహజ పద్ధతుల ద్వారా పంటల దిగుబడిని పెంచడంతో పాటు నేల సారాన్ని కాపాడుకోవడం కోసం మోదీ ప్రభుత్వం కృషి చేస్తోందని రైతులకు వివరించారు.నమామి గంగే పరిధిలో సేంద్రీయ వ్యవసాన్ని తప్పనిసరి చేసి ఆరోగ్యకరమైన ఆహార ఉత్పత్తులను భారత ప్రభుత్వం అందిస్తుందని,ఇలాంటి ఆహార ఉత్పత్తులను తినటం వలనే మన భారతదేశ ప్రజలు కరోనాను సైతం తట్టుకొని నిలబడగలిగారని ఆమె తెలియజేశారు.ఈ సమావేశంలో పాల్గొన్న సేంద్రీయ వ్యవసాయ సైంటిస్టులు సేంద్రీయ,ప్రకృతి వ్యవసాయం గురించి రైతులకు పలు సూచనలు సలహాలు చేశారు.ఈ సమావేశానికి హాజరైన రైతులు సహజ,సేంద్రీయ వ్యవసాయ విధానాలను ప్రశంసిస్తూ,ఇవి రైతుల ఖర్చులను తగ్గించి ఆరోగ్యకరమైన ఆహార ఉత్పత్తికి దోహదపడతాయని, మెరుగైన ఆదాయాన్ని కూడా పొందవచ్చని వారి అభిప్రాయలు వెల్లడించారు.ఈ సమావేశానికి అతిథులుగా పాల్గొన్న వక్తలు మాట్లాడుతూ భవిష్యత్ తరాలకు సురక్షితమైన పర్యావరణాన్ని అందించేందుకు సహజ వ్యవసాయం ఒక ఉత్తమ మార్గమని పేర్కొన్నారు. రైతుల ఆదాయాన్ని పెంచడంతో పాటు ప్రకృతి పరిరక్షణకు దోహదపడే ఈ విధానాలను మరింత విస్తృతంగా అమలు చేయాలని సమావేశంలో బిజెపి మరియు బిజెపి కిసాన్ మోర్చ నాయకులు పిలుపునిచ్చారు.సేంద్రీయ,ప్రకృతి వ్యవసాయ రైతులను, సైంటిస్టులను కిసాన్ మోర్చ జిల్లా పదాధికారులు ఘనంగా సత్కరించారు.ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సేంద్రీయ వ్యవసాయ ఆహార ఉత్పత్తుల స్టాల్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.ఈ కార్యక్రమంలో బిజెపి జాతీయ కార్యవర్గ సభ్యులు అయ్యాజీ వేమా , రాష్ట్ర బిజెపి అధికార ప్రతినిధి నల్లా పవన్ ,అనకాపల్లి జిల్లా బిజెపి ఇంచార్జ్ కర్రి చిట్టిబాబు ,రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పాలూరి సత్యానంద , కిసాన్ మోర్చ రాష్ట్ర కార్యదర్శి నాగిరెడ్డి సతీష్ రావు ,కిసాన్ మోర్చ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఇళ్ల దొరబాబు దొరబాబు ,బిజెపి జిల్లా ప్రధాన కార్యదర్శులు సలాది వీరబాబు ,చీకురపల్లి శ్రీనివాసరావు ,కిసాన్ మోర్చ జిల్లా ప్రధాన కార్యదర్శులు కటికిరెడ్డి తమ్మయ్య నాయుడు ,ఉయ్యూరు రామరాజు ,మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ గొల్లకోటి వెంకట్ రెడ్డి ,జిల్లా ఎస్.సి.మోర్చ అధ్యక్షులు పి.శ్రీనివాసరావు , మైనారిటీ మోర్ఛ అధ్యక్షులు ఎస్. సాథిక్ ,ముమ్మిడివరం మండల అధ్యక్షులు శర్మ ,ముమ్మిడివరం రూరల్ మండల అధ్యక్షులు దుర్గ అధికారులు తదితరులు అతిథులుగా పాల్గొన్నారు.ఈ కార్యక్రమానికి సహకరించిన అతిథులకు, అధికారులకు,సైంటిస్టులకు, రైతులకు బిజెపి, కిసాన్ మోర్చ, మరియు వివిధ మోర్ఛాల జిల్లా పదాధికారులు, నాయకులు, కార్యకర్తలకు ప్రతీ ఒక్కరికీ పేరు పేరున కిసాన్ మోర్చ రాష్ట్ర కార్యదర్శి నాగిరెడ్డి సతీష్ రావు కృతజ్ఞతలు తెలియజేశారు.

🌐 Select Language:
📰 ePaper