ఆర్భాటంగా నేషనల్ హైవే రహదారి మెరుగులు దిద్దారు. స్పీడ్ బ్రేకర్లు మరిచారు

June 20, 2026 | తెలంగాణ

జనం న్యూస్ నందలూరు కడప జిల్లా నందలూరు మండలంలోని కడప చెన్నై నేషనల్ హైవే రహదారిలో గత నాలుగు నెలల క్రితం రహదారికి ఆర్భాటంగా నేషనల్ హైవే అధికారులు మెరుగులు దిద్దారు. కానీ బస్టాండుకు ఇరువైపులా స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు చేయలేక పోవడంతో నిత్యం వేలాది వాహనాలు, చెన్నై నుంచి భారీ వాహనాలు ఈ మార్గానవెళ్ళ వలసి ఉంది స్పీడ్ బ్రేకర్లు లేనందున డ్రైవర్లు ఇష్టాను రాజ్యంగా బస్టాండ్ కూడలిలో యదేచ్చగావేగం తగ్గించకుండా వాహనాలు వెళుతున్నాయి. దీంతో బస్టాండ్ కూడలిలో రోడ్డు దాటాలంటే స్థానికులు భయాం దోళన చెందుతున్నారు ఇకనైనా నేషనల్ హైవే అధికారులు బస్టాండుకు విరువైపులా స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు చేసి ప్రమాదాలు జరగకుండా చూడవలసిన అవసరం ఎంతైనా ఉందని మండల వాసులు కోరు తున్నారు.

🌐 Select Language:
📰 ePaper