జోగుళాంబ గద్వాల పోలీస్. ట్రాఫిక్ వింగ్‌ను ఆకస్మికంగా తనిఖీచేసిన జిల్లా ఎస్పీ టి. శ్రీనివాసరావు, ఐపీఎస్

June 20, 2026 | తెలంగాణ

జనం న్యూస్ 20 జూన్ 2026 జిల్లా బ్యూరో ఇన్చార్జి జోగులాంబ గద్వాల్ జిల్లా విష్ణు వర్ధన్ గౌడ్ ; క్రమశిక్షణ, నీట్ టర్నౌట్, సమర్థవంతమైన విధుల నిర్వహణపై సిబ్బందికి దిశానిర్దేశం జోగుళాంబ గద్వాల జిల్లా ఎస్పీ శ్రీ టి. శ్రీనివాసరావు ఐపీఎస్ ఈ రోజు గద్వాల టౌన్ ట్రాఫిక్ వింగ్‌ను ఆకస్మికంగా సందర్శించి తనిఖీ నిర్వహించారు. ఈ సందర్భంగా ట్రాఫిక్ వింగ్ పరిసరాలు, వాహనాల పార్కింగ్ ప్రదేశాలు, సిబ్బంది విధుల నిర్వహణ తీరును క్షుణ్ణంగా పరిశీలించారు.అనంతరం ట్రాఫిక్ సిబ్బందితో నేరుగా మాట్లాడి వారి బాధ్యతలు రోజువారీ విధుల గురించి ఆరా తీశారు.ట్రాఫిక్ ఆర్‌ఎస్‌ఐ బాలచంద్రుడిని రోజువారీ డ్యూటీల నిర్వహణ, ట్రాఫిక్ నియంత్రణ చర్యలపై అడిగి తెలుసుకున్న ఎస్పీ ప్రజలకు నాణ్యమైన సేవలు అందించడంలో ట్రాఫిక్ విభాగం కీలక పాత్ర పోషిస్తుందని పేర్కొన్నారు.ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ట్రాఫిక్ పోలీసుల ఆటిట్యూడ్ బాడీ లాంగ్వేజ్, యూనిఫాం ధరించే తీరు (నీట్ టర్నౌట్) క్రమశిక్షణ నేరుగా పోలీస్ శాఖ ప్రతిష్ఠను ప్రతిబింబిస్తాయని అన్నారు. ప్రతి పోలీసు సిబ్బంది ప్రజలతో మర్యాదగా వ్యవహరిస్తూ కమిట్‌మెంట్‌తో విధులు నిర్వర్తించాలని సూచించారు. అదేవిధంగా ట్రాఫిక్ వింగ్ పరిసరాలను ఎల్లప్పుడూ పరిశుభ్రంగా ఉంచుకోవాలని, ప్రతి సిబ్బంది తమకు కేటాయించిన ట్రాఫిక్ పాయింట్లలోనే అప్రమత్తంగా విధులు నిర్వహించాలని ఆదేశించారు. రద్దీ సమయాల్లో ట్రాఫిక్‌ను సమర్థవంతంగా నియంత్రిస్తూ రోడ్డు వినియోగదారులకు ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు.ఈ తనిఖీలో గద్వాల డీఎస్పీ వై. మొగిలయ్య గద్వాల సీఐ టంగుటూరి శ్రీను, ట్రాఫిక్ వింగ్ ఆర్‌.ఎస్‌.ఐ. బాలచంద్రుడు మరియు ట్రాఫిక్ వింగ్ సిబ్బంది పాల్గొన్నారు.

🌐 Select Language:
📰 ePaper