యోగ సాధనతో శరీరిక & మానసిక శక్తిని పెంపొందించు కోవచ్చునని జిల్లా బిజెపి అధ్యక్షులు అడబాల
జనం న్యూస్ జూన్ 21 (ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ) అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం హెల్త్ అండ్ ఫిట్నెస్ జిమ్ & యోగా సెంటర్ లో నిర్వహించిన యోగ డే కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన జిల్లా బిజెపి అధ్యక్షులు అడబాల సత్యనారాయణ యోగా సాధన ద్వారా శరీరిక & మానసిక శక్తిని పెంపొందించుకోవచ్చునని తెలిపారు. అనంతరం యోగ థెరపిస్ట్ కంకిపాటి వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో యోగ ప్రోటోకాల్ ప్రకారం యోగ ఆసనాలు & ప్రాణాయామం ను యోగ సాధకులసే చేయటం జరిగింది. ఈ కార్యక్రమంలో టౌన్ అధ్యక్షులు అయ్య ల భాస్కరరావు ,జిల్లా బిజెపి సీనియర్ నాయకులు ఇళ్ల సత్యనారాయణ, దాట్ల వెంకట సుబ్బరాజు, సం సాని రత్నకుమార్ , సంషూ సాదిక్ , అయ్యల భాస్కరరావు పెద్దిరెడ్డి రాము, మేకల కిషోర్, సిహెచ్. శంకర్ నారాయణ, జి. దొరబాబు, ఎం.రాహుల్, వి.గోపి, ఎల్.సత్యనారాయణ & జిల్లా బిజెపి కార్యకర్తలు పాల్గొన్నారు అన్ని కంకిపాటి వెంకటేశ్వర రావు తెలిపారు.