నారెడ్డిపల్లి పంచాయతీ పరిధిలో అంతర్జాతీయ యోగా దినోత్సవం

June 21, 2026 | తెలంగాణ

జనం న్యూస్ నందలూరు కడప జిల్లా 21-06-26ఈ రోజున నందలూరు మండలం నాగిరెడ్డిపల్లి గ్రామ పంచాయతీ పరిధి యందు భారతీయ జనతా పార్టీ కుటుంబ సభ్యులచే అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భముగా మన భారత దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అత్యున్నతంగా భావించే యోగ ను యోగా సనాలతో జరపబడడం జరిగినది. ఈ కార్యక్రమంలో నందలూరు సహకార బ్యాంక్ త్రీ మెన్ కమిటీ డైరెక్టర్ ఆండ్ర శివారెడ్డి, నందలూరు మండల బిజెపి ఉపాధ్యక్షులు మండెం నాగేంద్ర, బిజెపి యువ నాయకులు వీరబల్లి జయ కుమార్ రెడ్డి, బీజేపీ రాజంపేట నాయకులు బాలరాజు సుందర్ బాబు, బిజెపి నాయకులు మరియు నందలూరు రైల్వే కన్సల్టేటివ్ మెంబర్ రాచూరి మురళి తదితర నాయకులు పాల్గొని మన దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ భారత దేశ ప్రతి ఒక్క పౌరుడు ఈ యొక్క యోగ ద్వారా ఆరోగ్యవంతంగా ఉండాలని అందు కోసమే ప్రతి రోజు యోగాన్ని ప్రతి ఒక్కరు జీవితంలో ఒక భాగముగా పరిగణలోకి తీసుకోవాలి అని సూచించినట్లు నాయకులు ప్రజలకి తెలియజేయడం జరిగినది.

🌐 Select Language:
📰 ePaper