మైనర్ బాలికల అదృశ్యం.. కేసు నమోదు
జనం న్యూస్, జూన్ 22,అచ్యుతాపురం: రాంబిల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో మైనర్ బాలికలు అదృశ్యమైన సంఘటన చోటుచేసుకుంది. రాంబిల్లి మండలం జెడ్. చింతువ పంచాయతీ వెంకయ్యపాలెం గ్రామానికి చెందిన మైలపల్లి రమ్య (15), ఈ నెల 20న మధ్యాహ్నం 03:45 గంటల సమయంలో బయటకు వెళ్తున్నానని చెప్పి ఇంటికి తిరిగి రాలేదు. కుటుంబ సభ్యులు మరియు బంధువులు వెంకయ్యపాలెం గ్రామం మరియు రాంబిల్లి పరిసర ప్రాంతాలలో గాలించినప్పటికీ బాలిక ఆచూకీ లభించలేదని బాలిక తండ్రి మైలపల్లి పైడిరాజు రాంబిల్లి పోలీస్ స్టేషన్లో పిర్యాదు చేశారు. మైనర్ బాలిక అదృశ్యం కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించబడిందని, బాలిక ఆచూకీ కోసం ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు చేపట్టడం జరిగిందని,బాలిక ఆచూకీ గురించి ఏమైనా సమాచారం తెలిసిన వారు వెంటనే సమీప పోలీస్ స్టేషన్ లేదా రాంబిల్లి పోలీస్ స్టేషన్ను 9440796108 ఫోన్ నెంబర్ లో సంప్రదించాలని స్థానిక సీఐ నర్సింగరావు ఒక ప్రకటనలో తెలిపారు.