జోగులాంబ గద్వాల్ జిల్లాలో మక్కజొన్న కొనుగోలు ఆలస్యం తీవ్ర ఇబ్బందుల్లో రైతులు
జనం న్యూస్ 11 మే 2026 జిల్లా బ్యూరో ఇన్చార్జి జోగులాంబ గద్వాల్ జిల్లా విష్ణు వర్ధన్ గౌడ్ : జోగులాంబ గద్వాల జిల్లాలో రైతులు ఎదుర్కొంటున్న మక్కజొన్న కొనుగోలు సమస్యలు రోజురోజుకు తీవ్రమవు తున్నాయని అడ్వకేట్ బంగారు నాగేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వం, సంబంధిత అధికారుల నిర్లక్ష్యం కారణంగా రైతులు తమ పంటను సరైన సమయంలో సరైన ధరకు విక్రయించలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు ప్రత్యేకంగా మక్కజొన్న బస్తాలను గోదాములకు తరలించడానికి రైతులు పట్టణాల్లోని పాత బస్టాండ్ సర్కిల్ వద్ద నిరసనలు చేపట్టాల్సిన పరిస్థితి రావడం అత్యంత బాధాకరం. గత 20 రోజులుగా కాంటా పట్టక నిల్వలో ఉన్న మక్కజొన్న బస్తాలు రైతులకు ఆర్థికంగా తీవ్ర నష్టాన్ని కలిగిస్తున్నాయి. రైతులు అప్పులు చేసి, చెమటోడ్చి పండించిన పంటను విక్రయించలేక ఆందోళన చెందుతున్నారు.మార్క్‌ఫెడ్ అధికారులు వెంటనే స్పందించి రైతుల సమస్యలను పరిష్కరించాల్సిన బాధ్యత కలిగి ఉన్నారు. గోదాములకు బస్తాలు తరలించడంలో ఆలస్యం చేయడం, కొనుగోలు ప్రక్రియను నిర్లక్ష్యం చేయడం రైతుల పట్ల అన్యాయం. ఈ పరిస్థితుల వల్ల రైతుల కుటుంబాలు ఆర్థికంగా మానసికంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి.అందువల్ల ప్రభుత్వం తక్షణమే మక్కజొన్న కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేసి, నిల్వలో ఉన్న బస్తాలకు వెంటనే కాంటా పట్టించి, రైతులకు సరైన గిట్టుబాటు ధర అందేలా చర్యలు తీసుకోవాలి. లేనిపక్షంలో రైతుల తరఫున పెద్ద ఎత్తున న్యాయపరమైన పోరాటం చేపట్టాల్సి వస్తుంది ప్రభుత్వం రైతు సంక్షేమం మాటల్లో కాకుండా చేతల్లో చూపించాలని, రైతుల సమస్యలను అత్యవసరంగా పరిష్కరించాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాను అన్నారు.