బోనస్ లేదు.. కొనుగోళ్లు లేవు..రైతు భరోసా,రైతు భీమా లేదు చేతులెత్తేసిన దద్దమ్మ ప్రభుత్వం. *ఎస్సి కార్పోరేషన్ మాజీ చెర్మెన్ వై. నరోత్తం

June 22, 2026 | తెలంగాణ

జనం న్యూస్ సంగారెడ్డి జిల్లా ఇన్చార్జ్. బి వీరేశం జూన్ : -22-06-2026 ప్రస్తుతం ఖరీఫ్ కానీ వర్షాలు రానందు వల్ల రైతులు పంటలు పెట్టలేక పోయారు.ప్రభుత్వం నుండి సరైన విత్తనాలు అందనందున రైతులు పక్కన గల కర్ణాటక రాష్ట్రం నుండి విత్తనాలు కొనుగోలు చేసుకొని పంటలు పెట్టిన వర్షాలు లేక అవి కూడా మొలకెత్తక ఎండిపోయాయి గతంలో అకాల వర్షాలకు పంట నష్టం జరిగి రైతులు నష్టపోయారు ఆ రైతులను ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే, కొనుగోళ్లు ఖతం.. రైతు భరోసా ఖతం.. రైతు బీమా ఖతం.. రేవంత్ పాలనలో రైతులకు మిగిలింది ఏమీ లేదు వరంగల్‌ సభలో ప్రకటించిన డిక్లరేషన్‌లో అన్ని పంటలకు మద్దతు ధరతో పాటు రూ. 500 బోనస్ ఇస్తామని ప్రకటించారు. కానీ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం బోనస్ లేదు, అన్ని పంటలను రాష్ట్ర ప్రభుత్వం మద్దతు ధరకు కూడా కొనుగోలు చెయ్యదు అని తేల్చి చెప్పారు. కేంద్రం ఏ పంట కొనమంటే ఆ పంట, ఎంత కొనమంటే అంతే కొంటామని కాంగ్రెస్ ప్రభుత్వం స్పష్టం చేయడం రైతు డిక్లరేషన్‌కు బొంద పెట్టడమే. ఎన్నికల ముందు చివరి గింజ వరకూ కొంటాం, రూ. 500 బోనస్ ఇస్తాం అని నమ్మించి, ఇప్పుడు బోనస్ లేదు, పంటలు కొనం అని కాంగ్రెస్ ప్రకటించడం రైతులను దారుణంగా మోసం చేయడమే. ఈ నిర్ణయానికి కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్ర రైతాంగానికి బేషరతుగా క్షమాపణ చెప్పాలని బీఆర్ఎస్ పక్షాన డిమాండ్ చేస్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వం కొనుగోళ్ల విషయంలో తన బాధ్యతల నుండి పూర్తిగా తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నది. కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కేంద్రం కొన్నా, కొనకపోయినా రాష్ట్ర ప్రభుత్వమే అన్ని పంటలూ కొనుగోలు చేసి రైతులకు మద్దతు ధర కల్పించారు. కాంగ్రెస్ ప్రభుత్వ ఈ రైతు వ్యతిరేక నిర్ణయాన్ని బీఆర్ఎస్ పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నది. వెంటనే ఈ నిర్ణయాన్ని బేషరతుగా ఉపసంహరించుకోవాలని రాష్ట్ర రైతాంగం పక్షాన డిమాండ్ చేస్తున్నాం.యూరియా విషయంలో అటు కేంద్రంలోని బీజేపీ, ఇటు రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వాలు రెండూ రైతుల జీవితాలతో చెలగాటమాడుతున్నాయి. కనీసం యూరియా సక్రమంగా ఇచ్చే తెలివి కూడా కాంగ్రెస్ ప్రభుత్వానికి లేదా. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు రైతులంటే ఎందుకింత చిన్నచూపు కేంద్ర ప్రభుత్వం అటు డీజిల్ ధరలు, ఇటు ఎరువుల ధరలు పెంచి రైతు మీద మోయలేని భారం మోపుతోంది, కానీ దానికి తగ్గట్టుగా మద్దతు ధర మాత్రం ఆ స్థాయిలో పెంచడం లేదు. బోనస్ ఇచ్చే రకాలను 33 నుంచి 7 రకాలకు ఎందుకు కుదించారో సమాధానం చెప్పాలి. పోయిన యాసంగికి రూ. 1200 కోట్ల బోనస్ ఎగ్గొట్టారు, ఈ వానాకాలం రూ. 700 కోట్ల బోనస్ ఎగ్గొట్టారు. కేసీఆర్ గారు ఏనాడూ రైతుబంధు వేయడానికి మీటింగ్ పెట్టలేదు. సమయానికి ఎలాంటి ఆర్భాటం లేకుండా 11 విడతల్లో రూ. 74 వేల కోట్లు నేరుగా రైతుల ఖాతాల్లో వేశారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఎకరానికో మీటింగ్ పెడుతున్నాది ఎన్నికల ముందు రైతుబంధు రూ. 10,000 ఉంటే రూ. 15,000 ఇస్తామని చెప్పారు కానీ 2024-25 వానాకాలం రైతుబంధు ఏ ఒక్క ఎకరానికి కూడా ఇవ్వకుండా గుండు సున్నా చేశారు. 2024-25 యాసంగికి మూడెకరాలకు ఇచ్చి మిగతా అందరికీ ఎగ్గొట్టారు. 2025-26 యాసంగికి రెండెకరాలకు ఇచ్చి మిగతా రైతులకు ఎగ్గొట్టారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఈ ఐదు పంటలు కలుపుకుని రైతుభరోసా కింద రైతాంగానికి ప్రభుత్వం బాకీ పడిన మొత్తం ఏకంగా రూ. 29,358 కోట్లు. జనవరి నెల నుంచి ఈరోజు వరకు చనిపోయిన 7,600 మంది రైతులకు ఐదు నెలలుగా రైతు బీమా డబ్బులు ఎందుకు పడలేదో ప్రభుత్వం సమాధానం చెప్పాలి. ఎల్ఐసీకి ప్రీమియం కట్టకపోవడం వల్లే చనిపోయిన రైతులకు బీమా రావడం లేదని స్పష్టంగా తెలుస్తోంది. కేసీఆర్ గారి ప్రభుత్వంలో చనిపోయిన పది రోజుల్లో ఎలాంటి అడ్డంకులు లేకుండా ఖాతాల్లో పడే రైతు బీమా.. ఇప్పుడు ఐదు నెలలైనా ఎందుకు రావడం లేదు? కేసీఆర్ ప్రభుత్వంలో ఏ పంట పండించినా మద్దతు ధర వస్తుందనే ధీమా రైతులకు ఉండేది. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఆ ధీమా లేకుండా చేసింది..దేశానికి అన్నం పెట్టే రైతే ఏ ప్రభుత్వానికైనా ప్రథమ ప్రాధాన్యతగా ఉండాలి. అన్ని పంటలను యథావిధిగా కొనుగోలు చేయాలని బీఆర్ఎస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తున్నాం.ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ స్వామిదాస్,యస్.గోపాల్,సి.సంఘమేశ్వర్,పవన్ రాథోడ్, మేఘనాథ్,లు ఉన్నారు

🌐 Select Language:
📰 ePaper