మాజీమంత్రి ఉషశ్రీ చరణ్‌కు మంత్రి సవిత వార్నింగ్
జనం న్యూస్: నాకు టీటీడీ లెటర్లు అమ్ముకునే నాలెడ్జ్ లేదు… సొంత కార్యకర్తలపైనే ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు పెట్టించే నాలెడ్జ్ నాకు లేదు’ అని మంత్రి సవిత చెప్పుకొచ్చారు. కల్యాణదుర్గం నుంచి బెంగుళూరుకు లారీల్లో ఇసుక తీసుకెళ్లి అమ్ముకునే నాలెడ్జ్ అంతకన్నా లేదు అని మంత్రి సవిత చెప్పుకొచ్చారు. రొద్దం మండలంలో రూ.4 కోట్లకుపైగా వెచ్చించి నిర్మించిన బీటీ రోడ్లను శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె తనను కలిసిన విలేకరులతో మాట్లాడారు. తనకు రాజకీయాలకంటే ముందే ఎస్ఆర్ఆర్ ట్రస్ట్ పేరుతో పేదలకు విద్య, వైద్యమందించానన్నారు. తాగునీటి పంపిణీ చేశానన్నారు. కరోనా సమయంలో నియోజక వర్గంలో విస్తృతంగా తనకు తోచిన మేర సహాయమందించానని మంత్రి సవిత వెల్లడించారు.ఈ సందర్భంగా మాజీమంత్రి ఉషశ్రీ చరణ్ ఆరోపణలకు మంత్రి తనదైన స్టైల్లో వార్నింగ్ ఇచ్చారు.‘వర్కులు అమ్ముకునే నాలెడ్జ్ లేదు… గన్ చూపించి దోచుకోవడమనే నాలెడ్జ్ అస్సలే లేదు. చెరువులు కబ్జా చేయడం, అక్రమ లే అవుట్లు వేసి అమ్ముకోవడం నాకు తెలీదు. పెనుకొండ ప్రజలకు సేవ చేయడం నాకు తెలిసిన నాలెడ్జ్’అని సవిత చెప్పుకొచ్చారు. వైసీపీ నాయకులు వలస పక్షులను నమ్ముకోవద్దని సూచించారు. మాజీమంత్రి ఉషశ్రీ చరణ్ నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడకుంటే ఖబడ్దార్’ అని మంత్రి సవిత వార్నింగ్ ఇచ్చారు.
ప్రజా సేవే నాకు తెలిసిన నాలెడ్జ్: ఎస్ఆర్ఆర్ ట్రస్టీగా, మంత్రిగా ప్రజలకు సేవ చేయడమే తనకు తెలిసిన ఏకైక నాలెడ్జ్ అని మంత్రి సవిత స్పష్టం చేశారు. టీటీడీ లెటర్లు అమ్ముకునే నాలెడ్జ్ తనకు అవసరంలేదని చెప్పుకొచ్చారు. మంత్రిగా తానిచ్చే టీటీడీ లెటర్లను కేవలం పెనుకొండ ప్రజలకు మాత్రమే ఇస్తున్నానని తెలిపారు. సొంత కార్యకర్తలపైనే ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు పెట్టడం తనకు తెలియని నాలెడ్జ్ అని అన్నారు. వాళ్లిళ్లలో జింక మాంసం పెట్టి వేధించిన నాలెడ్జ్ కూడా తనకు అవసరం లేదన్నారు. కల్యాణదుర్గం నుంచి బెంగుళూరుకు లారీల్లో ఇసుక తీసుకెళ్లి అమ్ముకునే నాలెడ్జ్ కూడా లేదన్నారు. వర్కులు అమ్ముకోవడంతో పాటు గన్ చూపించి దోచుకోవడమనే నాలెడ్జ్ తనకు అస్సలా లేదన్నారు. చెరువులు కబ్జా చేయడం, అక్రమ లే అవుట్లు వేసి అమ్ముకోవడం తనకు తెలీదన్నారు. పెనుకొండ ప్రజలకు సేవ చేయడమే తనకు తెలిసిన నాలెడ్జ్ అని మంత్రి సవిత స్పష్టం చేశారు.