కే జి బి వి పాఠశాలల్లో అర్హులైన బాలికలకు వెంటనే సీట్లు కేటాయించాలి
జనం స్ఫూర్తి న్యూస్ 23 జూన్ 2026 జిల్లా బ్యూరో ఇన్చార్జి జోగులాంబ గద్వాల్ జిల్లా విష్ణు వర్ధన్ గౌడ్ ; ఆర్ సి ఓ టి యన్ యస్ యాప్ పి డి యస్ యూ యస్ యాప్ ఐ వినతిపత్రం. జోగులాంబ గద్వాల్ జిల్లా కస్తూర్బా గాంధీ బాలిక విద్యాలయాల్లో కే జి బి వి ప్రవేశాల ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించి అర్హులైన బాలికలకు వెంటనే సీట్లు కేటాయించాలని యూ యస్ యాప్ ఐ జిల్లా కమిటీ డిమాండ్ చేసింది. ఈ మేరకు ప్రాంతీయ సమన్వయ అధికారి ఆర్ సి ఓ కి వినతిపత్రం అందజేసింది.
ఈ సందర్భంగా యూ యస్ యాప్ ఐ పి డి యస్ యూ టీ యన్ యస్ యాప్ నాయకులు మాట్లాడుతూ పేద అనాథ ఒంటరి తల్లిదండ్రుల పిల్లలు బడి బయట ఉన్న బాలికలు మరియు వెనుకబడిన వర్గాలకు చెందిన విద్యార్థినులకు ప్రవేశాల్లో ప్రాధాన్యత కల్పించాలని కోరారు. సీట్ల కేటాయింపులో ఎలాంటి అవకతవకలు, రాజకీయ జోక్యాలు లేకుండా పూర్తి పారదర్శకత పాటించాలని సూచించారు కే జి బి వి పాఠశాలలు గ్రామీణ ప్రాంతాల పేద బాలికలకు విద్యా అవకాశాలను కల్పించే ముఖ్యమైన విద్యాసంస్థలని, అర్హులైన ఒక్క విద్యార్థిని కూడా విద్యకు దూరం కాకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.ఇప్పటికైనా పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులను పరిశీలించి ఖాళీగా ఉన్న సీట్లను వెంటనే భర్తీ చేసి అర్హులైన విద్యార్థినులకు న్యాయం చేయాలని పి డి యస్ యూ నాయకులు కోరారు.ఈ కార్యక్రమంలో యూ యస్ యాప్ ఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి వామన్ పల్లీ రంగస్వామి టి యన్ యస్ యాప్ రాష్ట్ర అధికార ప్రతినిధి ఉప్పేరు సుభాన్ పి డి యస్ యూ జిల్లా అధ్యక్షులు హాలింపాషా చందుపషా తిరుమలేష్ నాయకులు పాల్గొన్నారు