బ్రహ్మా కుమారీస్ ఆధ్వర్యంలో మాతృ దినోత్సవ వేడుకలు
జనం న్యూస్ ; 11 మే సోమవారం; సిద్దిపేట నియోజిక వర్గ ఇన్చార్జి వై.రమేష్ ;మాతృ దినోత్సవం సందర్భంగా సిద్దిపేట పట్టణం శివాజీ నగర్ లోని బ్రహ్మా కుమారీస్ ఆధ్వర్యంలో ఘనంగా మాతృ దినోత్సవ వేడుకలను నిర్వహించారు, ఈ కార్యక్రమంలో భాగంగా సిద్దిపేట పట్టణ మాతృమూర్తులు అందరికీ మాతృ దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతూ”ఆరోగ్యప్రదమైన, సంతోషకరమైన కుటుంబానికి తల్లి యొక్క పాత్ర ఏమిటి?” అనే అంశం పైన సంస్థ నిర్వాహకురాలు బికే. భవాని మాట్లాడుతూ తల్లి నే బిడ్డకి మొదటి గురువు అని చెప్తారు కదా, కాబట్టి ప్రతి కుటుంబం ఆరోగ్యంగా, సంతోషంగా ఉండాలి అంటే ఆధ్యాత్మికత అవసరం అని, మాతృమూర్తులు ఆధ్యాత్మికత మార్గంలో నడుస్తూ పిల్లల లో ఆధ్యాత్మిక భావాలను పెంపొందిస్తూ, మన భారతీయ విలువలను, సంస్కృతి, ధర్మం గురించి తెలియజేస్తూ మన సనాతన ధర్మ నియమాలని పాటిస్తూ ఆరోగ్యకరంగా, సంతోషంగా జీవించే విధంగా చేయడంలో తల్లి పాత్ర ముఖ్యమని, మహిళలు ఆధ్యాత్మిక మార్గంలో నడవాలని తెలియజేశారు, అనంతరం సంస్థ సభ్యులందరూ కలిసి భవాని కి శాలువాతో సన్మానించారు. అలాగే బ్రహ్మా కుమారీస్ సెంటర్ కి వచ్చే చిన్న పిల్లలు వాళ్ల అమ్మలని పిలిచి వారికి శాలువాలు కప్పి ఘనంగా సన్మానం చేశారు, అనంతరం సంస్థ సభ్యులందరూ కేక్ కట్ చేసి, చిన్న స్కిట్, ఆటపాటలతో మాతలందరు సంతోషంగా వేడుకలను జరుపుకున్నారు, ఈ కార్యక్రమంలో సంస్థ ప్రతినిధి బి కే స్వప్న, సంస్థ సభ్యులు బిందు, విమల, నాగలక్ష్మి, పద్మ, భవాని, శాంత తదితరులు పాల్గొన్నారు.