S.I.R కి సంబందించిన రాష్ట్ర ఎన్నికల అధికారికి 15 సూచనలతో బిఆర్ఎస్ వినతిపత్రం
జనం న్యూస్ : వనపర్తి డివిజన్ రీపోటర్ కటికల శివకుమార్ పెబ్బేరు జూన్ 24 2026 బుధవారం వనపర్తి జిల్లా పెబ్బేరు ఈ నెల 25వ తేదీ నుండి ‘స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్’ (S.I.R) ప్రారంభం కానున్న నేపథ్యంలో, భారత రాష్ట్ర సమితి (BRS) ప్రతినిధి బృందం రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి (CEO) సుదర్శన్ రెడ్డిని కలిసింది. ఈ సందర్భంగా ఓటర్ల జాబితా సవరణలపై 15 ముఖ్యమైన సూచనలతో కూడిన వినతిపత్రాన్ని వారికి సమర్పించింది.సీఈఓను కలిసిన వారిలో ఎమ్మెల్సీ డాక్టర్ దాసోజు శ్రవణ్, మాజీ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్, బిఆర్ఎస్ ప్రధాన కార్యదర్శులు రావుల చంద్రశేఖర్ రెడ్డి,సోమా భరత్ కుమార్, బీసీ కమిషన్ మాజీ సభ్యుడు కె. కిషోర్ గౌడ్ మరియు బిఆర్ఎస్వీ (BRSV) నేత రవినాయక్ తదితరులు ఉన్నారు. End