వృక్ష సంపదను కొల్ల గొడుతున్న అధికారులు

June 25, 2026 | తెలంగాణ

జనం న్యూస్ 25 జూన్ 2026 జిల్లా బ్యూరో ఇన్చార్జి జోగులాంబ గద్వాల్ జిల్లా విష్ణు వర్ధన్ గౌడ్ తెలంగాణ రాజ్యాధికార పార్టీ గద్వాల్ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ సింధనూర్ ఉప్పరి. గంగాధర్, మాట్లాడుతూ గద్వాల్ జిల్లాలో హరితహారం చెట్ల నరికివేతపై చర్యలు తీసుకోవాలి. జోగులాంబ గద్వాల జిల్లాలో ప్రతి గ్రామంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించిన హరితహారం కార్యక్రమంలో నాటిన చెట్లను నరికి వేయడం చాలా దురదృష్టకర ఘటన రాష్ట్రంలో హరితహారం చెట్లు వేయడం ఎందుకు. ఇప్పుడు వాటిని నరికి వేయడం ఎందుకు. పర్యావరణ పరిరక్షణ లక్ష్యంగా కోట్లాది మొక్కలు నాటిన ప్రభుత్వం, వాటి సంరక్షణకు కూడా సమాన ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఉంది.హరితహారం కార్యక్రమంలో నాటిన మొక్కలు సంవత్సరాల పాటు పెరిగి పెద్ద చెట్లుగా మారిన తర్వాత వాటిని నరికివేయడం పర్యావరణానికి తీవ్ర నష్టం కలిగించే పక్రియ చెట్ల నరికివేతకు బాధ్యులైన వ్యక్తులపై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకోవాలి. అలాగే వాటి సంరక్షణలో నిర్లక్ష్యం వహించిన వారిని చట్టపరమైన చర్యలు తీసుకోవాలి. ప్రజా ప్రతినిధులు, అధికారులు పర్యావరణ పరిరక్షణ గురించి మాట్లాడటం మాత్రమే కాకుండా, నాటిన మొక్కలు సురక్షితంగా పెరిగేలా చర్యలు తీసుకోవాలి. హరితహారం ద్వారా నాటిన చెట్లకు సరైన రక్షణ లేకపోవడం వల్లే ఇటువంటి ఘటనలు జరుగుతున్నాయని వారు విమర్శిస్తున్నారు.జోగులాంబ గద్వాల జిల్లా కలెక్టర్ ఈ ఘటనపై అలాగే సంరక్షణలో నిర్లక్ష్యం వహించిన అధికారులపై కూడా తగిన చర్యలు తీసుకోవాలనీ కోరడమైనది.ఇటువంటి ఘటనలపై కఠినంగా వ్యవహరిస్తే భవిష్యత్తులో మరెవ్వరూ చెట్ల నరికివేతకు పాల్పడకుండా నిరోధించవచ్చని వారు అభిప్రాయ పడుతున్నారు. పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత. హరితహారం ద్వారా నాటిన ప్రతి మొక్కను, ప్రతి చెట్టును కాపాడుకోవడం ద్వారా మాత్రమే మానవాళికి ఎంత మేలు జరుగుతుంది. జిల్లా కలెక్టర్ గారు ఈ విషయంపై కఠినంగా వ్యవహరించాలి. తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఈ విషయంపై తీవ్రంగా దృష్టి కొనసాగిస్తామని అన్నారు. జోగులాంబ గద్వాల్ జిల్లా తెలంగాణ రాజ్యాధికార పార్టీ జిల్లా అధ్యక్షుడు మొరుగు.మ వీరేష్ ఉపాధ్యక్షులు పి జి కే గోవింద్ రాజ్ వర్కింగ్ ప్రెసిడెంట్ సింధనూర్ ఉప్పరి గంగాధర్, అయిజ మండల అధ్యక్షులు శేఖర్ నాయుడు ఉపాధ్యక్షులు భీమేష్, ప్రధాన కార్యదర్శి జుంజు కృష్ణ జోగులాంబ గద్వాల్ జిల్లా మీడియా ఇంచార్జ్ యు.రాముడు,

🌐 Select Language:
📰 ePaper