స్పెషల్ ఇంటెన్సివ్ రివిషన్ (SIR) – పాస్పోర్ట్ సైజ్ ఫోటో అవసరం పై అవగాహన.
జనం న్యూస్ : వనపర్తి డివిజన్ రీపోటర్ కటికల శివకుమార్ వనపర్తి జిల్లా పెబ్బేరు జూన్ 25 2026 భారత ఎన్నికల సంఘం చేపట్టిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిషన్ (SIR) ప్రక్రియలో భాగంగా ఓటరు జాబితా సవరణ, కొత్త ఓటర్ల నమోదు, వివరాల మార్పులు చేపడుతున్నారు. ఈ ప్రక్రియ సక్రమంగా పూర్తయ్యేందుకు ప్రతి ఓటరు సహకారం ఎంతో అవసరం.ఈ నేపథ్యంలో, ఓటు హక్కు కలిగిన ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా పాస్పోర్ట్ సైజ్ ఫోటో సిద్ధంగా ఉంచుకోవాలి. ఇంటింటికి వచ్చే బూత్ లెవల్ ఆఫీసర్లు (BLO) అవసరమైన వివరాలతో పాటు ఫోటోను కూడా సేకరిస్తారు.పాస్ ఫోటో సిద్ధంగా ఉంటే నమోదు ప్రక్రియ వేగంగా పూర్తవుతుంది. అలాగే ఓటరు జాబితాలో వివరాలు సరిచేయడం, కొత్తగా పేరు నమోదు చేయడం, చిరునామా మార్పులు వంటి పనులు సులభమవుతాయి. కాబట్టి, 18 సంవత్సరాలు నిండిన ప్రతి పౌరుడు మరియు ఇప్పటికే ఓటరు జాబితాలో పేరు ఉన్నవారు తమ పాస్ ఫోటోతో పాటు అవసరమైన పత్రాలను సిద్ధం చేసుకోవాలి. ప్రజలు ఈ అవకాశాన్ని వినియోగించుకుని తమ ఓటు హక్కును పరిరక్షించుకోవాలి.మీ ఓటు – మీ హక్కు. ప్రజాస్వామ్య బలానికి మీ భాగస్వామ్యం ఎంతో ముఖ్యం.