మద్నూర్‌లో ఎస్ ఐ ఆర్ ఎన్యూమరేషన్ ఫారం పంపిణీని పరిశీలించిన తహసీల్దార్*
మద్నూర్, జూన్ 25 జనం న్యూస్ ఓటరు జాబితా సవరణ కార్యక్రమం ఎస్ ఐ ఆర్ లో భాగంగా ఇంటింటికి ఎన్యూమరేషన్ ఫారం పంపిణీ ప్రక్రియను మద్నూర్ మండల తహసీల్దార్ ఎం డి ముజీబ్ పరిశీలించారు.మద్నూర్ మండల కేంద్రంలోని పలు వార్డుల్లో బి ఎల్ ఓ లు ఇంటింటికి వెళ్లి ఫారాలను అందజేస్తున్న తీరును ఆయన క్షేత్రస్థాయిలో పరిశీలించారు. పంపిణీ సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఫారంలో నింపాల్సిన వివరాలపై బి ఎల్ ఓ కు సూచనలు చేశారు.ఈ సందర్భంగా తహసీల్దార్ మాట్లాడుతూ, “ప్రతి ఇంటికి తప్పకుండా ఫారం అందాలి. అర్హులైన ఓటర్ల వివరాలు ఖచ్చితంగా నమోదు కావాలి. పంపిణీ పూర్తయిన వెంటనే సేకరణ కూడా వేగంగా జరగాలి” అని తెలిపారు.పౌరులకు ఎస్ ఐ ఆర్ ప్రక్రియపై సరైన అవగాహన కల్పించాలని, ఏవైనా సందేహాలుంటే వెంటనే బి ఎల్ ఓ ను సంప్రదించాలని సూచించారు. గడువులోగా 100% పంపిణీ పూర్తి చేయాలని బి ఎల్ ఓ కు ఆదేశించారు.పంపిణీ కార్యక్రమంలో ఎన్నికల విభాగం నాయబ్ తహశీల్దార్ శివ రామకృష్ణ, గిర్దావర్ మురళీధర్, బి ఎల్ ఓ సూపర్వైజర్ రవి కుమార్, బి ఎల్ ఓ లు సత్యం, బాబు, స్వామి, హుల్లాజీ, మరియు స్థానిక రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు.