ఉదయ్ అసోసియేషన్ రాష్ట్రవ్యాప్త గర్జన జోగులాంబ గద్వాల జిల్లాలో భారీ విజయం
*జనం న్యూస్ 25 జూన్ 2026 జిల్లా బ్యూరో ఇన్చార్జి జోగులాంబ గద్వాల్ జిల్లా విష్ణు వర్ధన్ గౌడ్ మిత్రులారా మహబూబ్ నగర్ జిల్లాలో మన దివ్యంగ సోదరుడిపై ఎ యస్ ఐ సాగర్ చేసిన అమానుష దాడికి నిరసనగా.. నేడు మన ఉదయ్ జోగులాంబ గద్వాల జిల్లా కమిటీ ఆధ్వర్యంలో జిల్లా అఫీషియల్స్ గారికి వినతిపత్రం అందజేయడం జరిగింది.మనం సమర్పించిన ప్రధాన డిమాండ్లు:ఎ యస్ ఐ సస్పెన్షన్: మహబూబ్ నగర్ లో దివ్యాంగుడిపై దాడి చేసిన సదరు ఎ యస్ ఐ ని తక్షణమే సర్వీస్ నుండి సస్పెండ్ చేయాలి.సెక్షన్ 92 కఠిన అమలు: జిల్లా పరిధిలో ఏ దివ్యాంగుడిపై దాడి లేదా వివక్ష జరిగినా ఆర్ పి డబ్ల్యూ సెక్షన్ 2016 లోని ‘సెక్షన్ 92’ జీవో (జీఓ) నిబంధనల ప్రకారం కఠినమైన నాన్-బెయిలబుల్ కేసులు నమోదు చేయాలి.అవగాహన బోర్డులు: జిల్లాలోని ప్రతి పోలీస్ స్టేషన్‌లో ‘సెక్షన్ 92’ చట్టపరమైన శిక్షల వివరాలతో కూడిన అవగాహన డిస్ప్లే బోర్డులను తక్షణమే ఏర్పాటు చేయాలి.అధికారుల సంచలన స్పందన:మన ఉదయ్ నాయకత్వం వినిపించిన గళానికి, సబ్జెక్ట్ నాలెడ్జ్‌కు అధికారులు పూర్తిగా సానుకూలంగా స్పందించారు. ఈ విషయాన్ని తాము తీవ్రంగా పరిగణిస్తూ.. బాధ్యుడైన అధికారిపై చర్యల కోసం మరియు రాష్ట్రవ్యాప్తంగా ఈ చట్టాన్ని పటిష్టం చేయడం కోసం రాష్ట్ర హోమ్ సెక్రెటరీ కి మరియు డీజీపీ (డి జీ పి) కి స్వయంగా అఫీషియల్ లేఖ (లీడర్) రాస్తామని బలమైన హామీ ఇచ్చారు మహబూబ్ నగర్ ఘటనపై గద్వాల జిల్లాలో స్పందించి అధికారుల ద్వారా డీజీపీ స్థాయి వరకు ఒత్తిడి తీసుకెళ్లిన జోగులాంబ గద్వాల జిల్లా ఉదయ్ జనరల్ సెక్రెటరీ హనుమంతు మరియు జిల్లా ఉదయ్ మహిళ అధ్యక్షురాలు మంజుల గారు అలాగే ఉదయ్ జిల్లా ముఖ్య నాయకులు గోవిందు మరియు గద్వాల్ అంజయ్య లకు రాష్ట్ర కమిటీ తరఫున విప్లవాత్మక అభినందనలు ఉదయ్ అసోసియేషన్