మెట్పల్లి 25వ వార్డులో SIR దరఖాస్తు ఫారాల పంపిణీ
జనం న్యూస్, జూన్ 25, జగిత్యాల జిల్లా, మెట్ పల్లి : మెట్పల్లి మున్సిపల్ పరిధిలోని 25వ వార్డులో ఈరోజు SIR దరఖాస్తు ఫారాల పంపిణీ కార్యక్రమం విజయవంతంగా నిర్వహించారు. మెట్పల్లి మున్సిపల్ చైర్మన్ మైలారపు లింబాద్రి ముఖ్య అతిథిగా పాల్గొని, 25వ వార్డు కౌన్సిలర్ అస్ర ఫర్హీన్ జావిద్ వార్డు BLO ఎం. పద్మ తో కలిసి ప్రజలకు స్వయంగా దరఖాస్తు ఫారాలను పంపిణీ చేశారు.ఈ సందర్భంగా చైర్మన్ మైలారపు లింబాద్రి మాట్లాడుతూ, ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలను పారదర్శకంగా అమలు చేస్తున్నామని, ప్రజలందరూ దరఖాస్తులను సక్రమంగా నింపి సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.ఈ కార్యక్రమంలో రమణ, ఆనంద్, వాజిత్, సుదర్శన్ గౌడ్, పద్మ, లావణ్య తదితరులు పాల్గొన్నారు. వార్డు ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.