డ్రగ్స్‌కు దూరంగా ఉంటేనే యువతకు ఉజ్వల భవిష్యత్ – మండల కాంగ్రెస్ అధ్యక్షుడు ముప్పు శ్రీనివాస్

జనం న్యూస్ 26 జూన్ 2026 (ఎల్కతుర్తి మండల్ బండి కుమారస్వామి రీపోటర్ ) హన్మకొండ జిల్లా ఎల్కతుర్తి మండల కేంద్రంలో శుక్రవారం అంతర్జాతీయ డ్రగ్స్ వ్యతిరేక దినోత్సవాన్ని పురస్కరించుకుని మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ ఆదేశాలు మేరకు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో డ్రగ్స్ వ్యతిరేక అవగాహన ర్యాలీ నిర్వహించారు. అంబేద్కర్ చౌరస్తా నుంచి పోలీస్ స్టేషన్ వరకు చేపట్టిన ఈ ర్యాలీలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.మండల కాంగ్రెస్ అధ్యక్షుడు ముప్పు శ్రీనివాస్ మాట్లాడుతూ, యువత మత్తు పదార్థాలకు బానిస కాకుండా అప్రమత్తంగా ఉండాలని అన్నారు. డ్రగ్స్ సమాజానికి, ముఖ్యంగా యువత భవిష్యత్తుకు పెను ముప్పుగా మారుతున్నాయని, గ్రామాలు, మండలాలు డ్రగ్స్ రహితంగా ఉండేలా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. “డ్రగ్స్‌ను నిర్మూలిద్దాం… యువత భవిష్యత్తును కాపాడుకుందాం” అనే నినాదంతో అవగాహన కల్పించారు.ఈ కార్యక్రమంలో గ్రామ శాఖ అధ్యక్షుడు సీలం అనిల్ కుమార్, ఎంసీ డైరెక్టర్లు గొడిశాల రాజయ్య, బచ్చు బాపురావు, అంబాల శ్రీకాంత్, మాజీ సర్పంచ్ యాదగిరి గౌడ్, సీనియర్ నాయకులు బొల్లెపోగు రమేష గొడిశాల అర్జున్ మండలంలోని కాంగ్రెస్ సర్పంచులు,పుల్లూరి శ్రీ దర్ రావు సంతృప్తిని రవింధర్ గౌడ్ వార్డు సభ్యులు, గ్రామ శాఖ అధ్యక్షులు, బచ్చు శ్రీ దర్ రావు కాంగ్రెస్ కార్యకర్తలు తదితరులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.