రాజ్యసభ సభ్యులు సానా సతీష్ సన్మానోత్సవాన్ని విజయవంతం చేయండి..
జనం న్యూస్ జూన్ 28 (ముమ్మిడివరం ప్రతినిధి గంధి నానాజీ) టిడిపి జిల్లా ప్రధాన కార్యదర్శి గంధం పల్లంరాజు….రెండో సారి రాజ్యసభ సభ్యులుగా ఎన్నికైన సానా సతీష్ కు పౌర సత్కారం చేయాలని భావించి ఘన సత్కారం ఏర్పాటు చేసినట్లు టిడిపి జిల్లా ప్రధాన కార్యదర్శి గంధం పల్లంరాజు తెలిపారు. తన స్వగృహం లో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో సన్మానోత్సవ కార్యక్రమం వివరాలు వెల్లడించారు. సానా సతీష్ బాబు కు రావులపాలెం సెంటర్ లో అక్కడ నేతలు ఘన స్వాగతం పలికిన తరువాత కార్ల ర్యాలీగా అంబాజీపేట చేరుకుంటారని పల్లంరాజు తెలిపారు. అక్కడ నుంచి బైక్ ర్యాలీగా అమలాపురం గడియార స్తంభం సెంటర్ కు చేరుకుంటారు. నల్లవంతెన వద్ద గల సత్యనారాయణ గార్డెన్స్ చేరుకుని అక్కడ వేలాది మందితో ఏర్పాటు చేసిన సమావేశంలో పౌర సమావేశంలో పాల్గొంటారని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని గంధం పల్లంరాజు కోరారు. మాజీ మున్సిపల్ చైర్మన్ చిక్కాల గణేష్ మాట్లాడుతూ ఈ సమావేశానికి అధిరథ మహారధులు తరలివస్తున్నారని అన్నారు. ముఖ్యంగా భారీ నీటి పారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు, టూరిజం మంత్రి కందుల దుర్గేష్, కార్మికశాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్, ఎంపీ హరీష్ బాలయోగి శాసన సభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్, పంచకర్ల రమేష్, అయితా బత్తుల ఆనంద రావు, దాట్ల బుచ్చిబాబు, బండారు సత్యానంద రావు, గిడ్డి సత్యనారాయణ, కన్నా లక్ష్మి నారాయణ, పంతం నానాజీ, దేవ ప్రసాద్, గొల్లపల్లి అమూల్య,ఎమ్మెల్సీ సోము వీర్రాజు, పేరాబత్తుల రాజశేఖర్, ఆదిరెడ్డి వాసు, కాపు నాయకులు అరేటి ప్రకాష్, ఆకుల రామకృష్ణ, వాసిరెడ్డి యేసు దాసు తో పాటు పలువురు ప్రముఖులు వస్తారని గణేష్ వెల్లడించారు. ఈ పాత్రి కేయుల సమావేశంలో బిజెపి నాయకులు మోకా వెంకట సుబ్బారావు చాంబర్ ఆఫ్ కామర్స్ ప్రెసిడెంట్ బోనం సత్య వరప్రసాద్, కొమ్ములు సురేష్ తదితరులు పాల్గొన్నారు.