బిచ్కుంద గవర్నమెంట్ హాస్పిటల్ లో పల్స్ పోలియో కార్యక్రమం.

ఐదేళ్ల లోపు ప్రతి చిన్నారికి పోలియో చుక్కలు వేయించాలి.
పల్స్ పోలియో కార్యక్రమాన్ని ప్రారంభించిన డాక్టర్ అబ్దుల్ సద్దాం
బిచ్కుంద జూన్ 28 జనం న్యూస్ ; కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండల కేంద్రంలోని గవర్నమెంట్ హాస్పిటల్ లో ఆదివారం నిర్వహించిన పల్స్ పోలియో కార్యక్రమాన్ని డాక్టర్ అబ్దుల్ సద్దాం ప్రారంభించారు. ఈ సందర్భంగా డాక్టర్ మాట్లాడుతూ.. “పిల్లల ఆరోగ్యమే దేశ భవిష్యత్తు. పోలియో రహిత సమాజ నిర్మాణానికి ఐదు సంవత్సరాల లోపు ప్రతి చిన్నారికి తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించాలని” తల్లిదండ్రులకు పిలుపునిచ్చారు. పోలియో వ్యాధిని పూర్తిగా నిర్మూలించాలంటే ప్రతి చిన్నారికి పోలియో చుక్కలు వేయించడం అత్యంత అవసరమని తెలిపారు. పల్స్ పోలియో కార్యక్రమాన్ని ప్రతి తల్లిదండ్రి సద్వినియోగం చేసుకొని తమ పిల్లలకు పోలియో చుక్కలు వేయించాలని కోరారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు సీమా గంగారం, ఆశా వర్కర్, తల్లిదండ్రులు మరియు స్థానిక ప్రజలు తడితరులు పాల్గొన్నారు.