ఐ. పోలవరం మండలంలో “పోలియో 2026” కార్యక్రమం లో పాల్గొన్న ప్రభుత్వ విప్ దాట్ల సుబ్బరాజు .
జనం న్యూస్ జూన్ 28 (ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ) ఐ. పోలవరం మండలంలో నిర్వహించిన పోలియో-2026 పల్స్ పోలియో కార్యక్రమంలో గౌరవ ప్రభుత్వ విప్, ముమ్మిడివరం శాసనసభ్యులు శ్రీ దాట్ల సుబ్బరాజు గారు పాల్గొన్నారు. ఈ సందర్భంగా చిన్నారులకు పోలియో చుక్కలు వేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు.పిల్లలను పోలియో మహమ్మారి నుంచి సంపూర్ణంగా రక్షించేందుకు ప్రతి తల్లిదండ్రులు తమ ఐదేళ్లలోపు చిన్నారులకు తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించాలని ఆయన పిలుపునిచ్చారు. ప్రభుత్వం చేపడుతున్న ఆరోగ్య కార్యక్రమాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.ఈ కార్యక్రమంలో వైద్య ఆరోగ్య శాఖ అధికారులు, ఆశా కార్యకర్తలు, అంగన్వాడీ సిబ్బంది, ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు మరియు గ్రామస్థులు పాల్గొన్నారు.