కూకట్‌పల్లిలో విస్తృతంగా పల్స్ పోలియో కార్యక్రమంచిన్నారులకు పోలియో చుక్కలు వేసిన కాంగ్రెస్ ఇన్‌చార్జ్ బండి రమేష్
జనం న్యూస్ జూన్ 28 తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ శ్రీనివాస్ రెడ్డి : కూకట్‌పల్లి నియోజకవర్గంలో ఆదివారం పల్స్ పోలియో కార్యక్రమం విస్తృతంగా నిర్వహించారు. కెపిహెచ్‌బి టెంపుల్ బస్‌స్టాప్ సమీపంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఏర్పాటు చేసిన పల్స్ పోలియో కార్యక్రమానికి టీపీసీసీ ఉపాధ్యక్షుడు, తెలంగాణ రాష్ట్ర కమ్మ కార్పొరేషన్ చైర్మన్, కూకట్‌పల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జ్ బండి రమేష్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆయన ఐదేళ్లలోపు చిన్నారులకు పోలియో చుక్కలు వేసి కార్యక్రమాన్ని ప్రారంభించి ఆశీర్వదించారు. ఈ సందర్భంగా బండి రమేష్ మాట్లాడుతూ, పోలియో నిర్మూలనలో ప్రతి తల్లిదండ్రి బాధ్యతాయుతంగా వ్యవహరించాలని, ఐదేళ్లలోపు ప్రతి చిన్నారికి తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించాలని సూచించారు. పోలియో రహిత తెలంగాణ సాధన రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని పేర్కొంటూ, అందుకు అనుగుణంగా రాష్ట్రవ్యాప్తంగా పల్స్ పోలియో కార్యక్రమాన్ని పటిష్టంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు.ప్రజలు, వైద్య ఆరోగ్య శాఖ అధికారులు, ఆశా కార్యకర్తలు సమన్వయంతో పనిచేసి పల్స్ పోలియో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఒక్క చిన్నారి కూడా పోలియో చుక్కలు మిస్ కాకుండా తల్లిదండ్రులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని కోరారు.
ఈ కార్యక్రమంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం సూపర్వైజర్ బాపమ్మాయ్, హెల్త్ అసిస్టెంట్లు రోజా, సుజాత, ఆశా వర్కర్లు, కాంగ్రెస్ పార్టీ నాయకులు పిడికిటి గోపాల్ చౌదరి, రంగమోహన్, రామారావు, చలసాని నలినీకాంత్, కళ్యాణ్, వెంకటేశ్వరరావు చున్ను పాష తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమం విజయవంతంగా సాగేందుకు వైద్య సిబ్బంది, ఆశా కార్యకర్తలు ప్రత్యేకంగా కృషి చేశారు.