డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కు భద్రత తొలగించడం రాజ్యాంగ విరుద్ధం. మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ సురేందర్ కుమార్
వికారాబాద్ జిల్లా (వుదయం) జూన్ 29, పరిగి పట్టణం. ఈ భారత దేశంలో టాప్ 5 థ్రెట్ ఐ పి ఎస్ ఆఫీసర్స్ లలో డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఒకరు అలాంటి ఆయనకు బుల్లెట్ ప్రూఫ్ వాహనం, సెక్యూరిటీ తొలగించడం రాజ్యాంగ విరుద్ధం అని పరిగి మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ అంతిగారి సురేందర్ కుమార్ అన్నారు.ప్రజల కోసం మాట్లాడే గొంతులను అణచివేయాలని చూసే ప్రతి ప్రయత్నాన్ని ప్రజలు తిప్పికొడతారు. భద్రతా అంశాలతో రాజకీయ కక్షసాధింపు మానుకోవాలి.ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ భద్రత తొలగిస్తే తీవ్ర పరిణామాలు తప్పవు ,26 సంవత్సరాల పాటు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ప్రాణాలను పణంగా పెట్టి పోలీసు శాఖలో సేవలందించిన మాజీ ఐపీఎస్ అధికారి, డా. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కి కల్పిస్తున్న బుల్లెట్ ప్రూఫ్ వాహనం, భద్రతా సిబ్బందిని కొనసాగించాలని ,అడవుల్లోకి వెళ్లి మావోయిస్టులతో చర్చలు జరిపి, వందలాది మంది నక్సలైట్లను జనజీవన స్రవంతిలోకి తీసుకువచ్చిన అధికారిగా డా. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కి ఇప్పటికీ ప్రాణ ముప్పు ఉన్న విషయం అందరికీ తెలిసిందేనన్నారు. అలాంటి వ్యక్తికి గత ప్రభుత్వాలు భద్రత కల్పిస్తే, నేడు ప్రజా సమస్యలపై ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నందుకే భద్రతను తగ్గించే ప్రయత్నాలు జరగడం అనేక అనుమానాలకు తావిస్తోందని అన్నారు.రాష్ట్రపతి శౌర్య పతకం పొందిన ఆఫీసర్ ఆయన. ఉమ్మడి రాష్ట్రంలో తీవ్రమైన సంక్షోభాలు వచ్చినప్పుడు, ప్రాణాలకు తెగించి ముందు వరుసలో నిలబడిన వ్యక్తి. ఆయన ప్రాణాలకు ఉన్న ముప్పును గుర్తించే కదా గత ప్రభుత్వాలు భద్రత కల్పించాయి? ఇప్పుడు ఆ ముప్పు సడెన్ గా ఎలా పోయింది? 2021లో ఆయన తన పదవికి రాజీనామా చేసి ప్రతిపక్ష పార్టీలో చేరినప్పుడు కూడా.. అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ ఆయన సెక్యూరిటీని తగ్గించలేదు. కానీ నేడు వ్యవస్థల వైఫల్యాలను ప్రశ్నిస్తున్నందుకే కక్షకట్టి భద్రతను ఉపసంహరించుకున్నారా? అని అన్నారు.ఒక దళిత బిడ్డ, నిజాయితీ గల ఆఫీసర్ పై ఇలాంటి చర్యలు ప్రజాస్వామ్యానికి చేటు. ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ ఎవరి ఒత్తిడితో ఈ నిర్ణయం తీసుకుంది,ప్రజా గొంతుకను అణచివేయలేరు, ప్రభుత్వ వైఫల్యాలు, అవినీతి, ప్రజా వ్యతిరేక నిర్ణయాలను ఎండగడుతున్న నాయకులను లక్ష్యంగా చేసుకుని భద్రతను ఆయుధంగా ఉపయోగించడం ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమన్నారు. ప్రజల గొంతుకగా మారిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పై ఏదైనా అవాంఛనీయ ఘటన జరిగితే దానికి రాష్ట్ర, ప్రభుత్వ పూర్తి బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు.ప్రజల కోసం నిస్వార్థంగా పనిచేసిన ఒక మాజీ ఐపీఎస్ అధికారికి కూడా భద్రత లేకుండా చేసే పరిస్థితి వస్తే, భవిష్యత్తులో ప్రజల కోసం పనిచేయాలనుకునే యువ అధికారులకు ప్రభుత్వం ఎలాంటి సందేశం ఇస్తోందో ఆలోచించాలన్నారు.వెంటనే డా. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కి బుల్లెట్ ప్రూఫ్ వాహనం, భద్రతా సిబ్బందిని యథాతథంగా కొనసాగించాలని, లేకపోతే రాష్ట్రవ్యాప్తంగా బహుజన సంఘాలు, ప్రజాస్వామ్యవాద శక్తులతో కలిసి భారీ ఉద్యమాలు చేపట్టి ప్రభుత్వ తీరును ఎండబెడతామని పరిగి మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ అంతి గారి సురేందర్ కుమార్ తెలియజేశారు.