పెబ్బేరు NH-44 రోడ్డుపై బోల్తా పడిన RTC బస్ ప్రమాదంలో గాయపడిన బాధితులను పరామర్శించిన కాంగ్రెస్ నాయకులు
జనం న్యూస్ : వనపర్తి డివిజన్ రిపోర్టర్ కటికల శివకుమార్ వనపర్తి జిల్లా పెబ్బేరు జూన్ 29 2026 సోమవారం ఈ ఉదయం మంత్రాలయం నుండి వనపర్తి వెళ్తున్న వనపర్తి డిపో బస్ అదుపుతప్పి,పెబ్బేరు NH-44 రోడ్డుబోల్తా పడిన సంఘటన లో ప్రమాద బాధితులను స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగావిషయం తెలుసుకున్న కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆసుపత్రికి వెళ్లి ప్రమాద బాధితులను పరామర్శించి,మెరుగైన వైద్యం అందివ్వాలని వైద్యులను సూచించారు.ఇట్టి విషయం స్థానిక ఎమ్మెల్యే శ్రీ తూడి మేఘా రెడ్డి కి సమాచారం అందించి,తీవ్ర గాయాలు అయిన వారిని వనపర్తి కి తరలించారాని వనపర్తి ఏరియా హాస్పిటల్ డాక్టర్ లకు సూచన చేయాలనీ కోరారు.అనంతరం సంఘటన స్థలానికి వెళ్లి ప్రమాద పరిస్థితిని పరిశీలించారు ఈ కార్యక్రమం మార్కెట్ వైస్ చైర్మన్ విజయ్ వర్ధన్ రెడ్డి, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు యాపార్ల రాంరెడ్డి , చిన్న గుమ్మడం శేఖర్ తదితరులు పాల్గొన్నారు.