పరిగి లో అయ్యప్ప స్వామి ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం
జనం న్యూస్ జూన్ 29 వికారాబాద్ జిల్లా పరిగి పరిగి పట్టణంలో 5వ వార్డులో అయ్యప్ప కాలనీలో నూతనంగా నిర్మించిన అయ్యప్ప స్వామి మందిరం లో జూలై 1వ తేదీ నుండి 5వ తేదీ వరకు అయ్యప్ప స్వామి విగ్రహ ప్రాణ ప్రతిష్ట మరియు హోమములు వివిధ రకాల పూజలు జరుగును. కావున అయ్యప్ప స్వామి భక్తులు హిందూ బంధువులు అందరూ తప్పకుండా ఈ యొక్క ఐదు రోజుల అయ్యప్ప స్వామి ప్రాణ ప్రతిష్ట కార్యక్రమంలో పాల్గొని అయ్యప్ప స్వామి ఆశీర్వాదం పొందగలరని పరిగి మార్కెట్ కమిటీ చైర్మన్ భూమన్న పరుశురాం రెడ్డి (గురుస్వామి )అన్నారు.