తాళ్లరేవులో 75 మంది బూత్ స్థాయి ఏజెంట్లతో సమగ్ర ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియపై సమావేశం*
జనం న్యూస్ జూన్ 29 ముమ్మిడివరం* డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం, తాళ్లరేవు మండలం*ముమ్మిడివరం నియోజకవర్గ తాళ్లరేవు మండలంలో ఈరోజు మండల అధ్యక్షుడు శ్రీ కదా గోవిందకుమార్ అధ్యక్షతన సమగ్ర ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియపై ముఖ్యమైన సమావేశం జరిగింది. *సమావేశ వివరాలు:* ఈ సమావేశంలో 75 మంది బూత్ స్థాయి ఏజెంట్లు పాల్గొన్నారు. రాష్ట్ర వైస్సార్ పార్టీ కేంద్ర కార్యనిర్వాహక మండలి సభ్యుడు శ్రీ పితాని బాలకృష్ణ బూత్ స్థాయి ఏజెంట్లకు గురుతర బాధ్యతలను గుర్తు చేసి, వారు చేయవలసిన విధానాలను వివరించారు. సమగ్ర ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియను ఎలా ముందుకు తీసుకువెళ్లాలి, ఎలా పూర్తి చేయాలి అనే దానిపై ధైర్యం చెప్పారు.*పాల్గొన్న ప్రముఖులు:* నియోజకవర్గ ఇన్చార్జి శ్రీ పొన్నాడ సతీష్ కుమార్, టాస్క్ ఫోర్స్ సభ్యుడు తోరం గౌతమ్, జిల్లా బూత్ కమిటీల అధ్యక్షుడు శ్రీ చీకట్ల కిషోర్, రాష్ట్ర నాయకులు కాశి లక్ష్మణ స్వామి, ఉంగరాల సంతోష్, జేడీ సూర్యనారాయణ రాజు, కాట్రేనికోన జిల్లా పరిషత్ ప్రాంతీయ నియోజకవర్గ సభ్యుడు నేల కిషోర్, ముమ్మిడివరం మండల పరిషత్ అధ్యక్షుడు కోలా బాబ్జి, తాళ్ళరేవు మండల ఉపాధ్యక్షుడు ధూళిపూడి బాబి తదితరులు పాల్గొన్నారు. జిల్లా నాయకులు రేవు నాగేశ్వరావు, అంకాడి అంజిబాబు, నియోజకవర్గ నాయకులు రేవు మల్లీశ్వరి, పొన్నాడ భైరవ మూర్తి, పందిరిపల్లి రాజేష్, గంటి ఆకాష్, మండల నాయకులు బొంతు మోహన్, మోకా మధు, రెడ్డి సతీష్, వెంటపల్లి వాసంతి, వెంటపల్లి నూకరాజు, పంపన రామకృష్ణ, ఆకుల వెంకన్న, మట్టపర్తి లోవరాజు, రెడ్డి నాగు, పేర్ని ఆదినారాయణ, గ్రామ కమిటీ అధ్యక్షులు, బూత్ స్థాయి ఏజెంట్లు, పార్టీ శ్రేణులు, మహిళా నాయకులు, అభిమానులు పెద్ద సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.
