ఆపదలో ఉన్న మిత్రురాలికి అండగా నిలిచిన 1999 2000 సంవత్సరం ఆత్మీయవిద్యార్థులు

June 29, 2026 | తెలంగాణ

జనం న్యూస్ జూన్ 29 చిలిపి చెడు మండల ప్రతినిధి : మెదక్ జిల్లా చిలిపిచేడు మండలం చండూరు గ్రామానికి చెందిన కృష్ణవేణి ఒకటవ తరగతి నుండి పదవ తరగతి వరకు చండూరులో చదువుకుంది ఆమె ఆరోగ్యం బాగోలేదని డాక్టర్లు చెప్పారు హార్ట్ ప్రాబ్లం ఉందని డాక్టర్లు చెప్పారు ఈ విషయం తెలుసుకున్న మిత్రులు 25 జనవరి 2025 సంవత్సరము ఆత్మీయ సమ్మేళన కార్యక్రమం నిర్వహించారు ఆ కార్యక్రమంలో విద్యార్థిని విద్యార్థులు ఒకరికొకరు సహాయ పడాలని వారు నిర్ణయించుకున్నారు ఆత్మీయ సమ్మేళనంలో మంచి చెడుల గురించి చర్చలు జరిపారు ఎవరికీ ఆపద వచ్చినా కలిసిమెలిసి ఏకతాటిపై ఉండి ప్రతి ఒక్కరికి సహాయం చేయాలని ఆలోచన తీసుకొచ్చారు అక్కడనే ఒక వాట్సాప్ గ్రూపు తయారు చేసి మిత్రులు ఫోన్లో సంభాషణ చేసుకోవడం జరిగింది స్కూల్ రోజుల్లో విడదీయలేని స్నేహం దశాబ్దాల తర్వాత కూడా అదే ఆత్మీయతను కొనసాగిస్తూ ఒకరి కష్టంలో ఒకరు తోడుగా నిలుస్తున్నారు 1999 2000 పదవ తరగతి బ్యాచ్ విద్యార్థులు తోటి మిత్రురాలు కృష్ణవేణి అనారోగ్యంతో ఉన్నందున వారి కుటుంబానికి ఎంతో కొంత సహాయం అందించాలని స్నేహితులు ఒక తాటిపై ఉండి అండగా నిలిచారు ప్రార్థించే పెదవుల కంటే సాయం చేసే చేతులే మిన్న అనే నమ్మే ఈ మిత్రుడు కేవలం ఈ ఒక్క సందర్భమే కాకుండా తమ బ్యాచ్ లోని మిత్రులకు ఈ ఆపద వచ్చినా ఎదురైన మేమున్నా మంటూ ఆత్మీయ హస్తాన్ని అందిస్తామని వారు కొనియాడారు స్నేహ బంధానికి సమయం దూరం అడ్డు కాదని కష్టాల్లో ఉన్న మిత్రులను ఆదుకోవడమే నిజమైన స్నేహం అని ఈ బృందం నిరూపించింది ఆదివారం మధ్యాహ్నం ఇస్నాపూర్ లో కృష్ణవేణి వాళ్ళ ఇంటికి వెళ్లి ఆర్థిక సహాయం అందజేశారు 50.200 రూపాయలను కృష్ణవేణికి అందజేశారు ఒక నిరుపేద కుటుంబానికి అండగా నిలిచారు ఆమె ఆరోగ్యం నిమిత్తం కొరకు ఆర్థిక సహాయాన్ని అందజేయడం జరిగింది కృష్ణవేణి ఆరోగ్యం తొందరగా కుదుటపడాలని అలాగే కష్టసుఖాల్లో అందరం పాలు పంచుకుందాం అని మిత్రులందరికీ ఆత్మీయ విద్యార్థులంతా తోడుగా నిలిచారు ఈ కార్యక్రమంలో గురువులు మిత్రబృందం అందరూ పాల్గొన్నారు మిత్రులందరికీ కృష్ణవేణి కృతజ్ఞతలు తెలియజేశారు

🌐 Select Language:
📰 ePaper