అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన ఎంపీ హరీష్ ఎమ్మెల్యే బుచ్చిబాబు…
జనం న్యూస్ మే 10 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీడాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజవర్గండాక్టర్ బీ ఆర్ అంబేద్కర్ 135 వ జయంతిని పురస్కరించుకుని అమలాపురం పార్లమెంట్ పరిధిలోని ముమ్మిడివరం నియోజకవర్గం ఐ పోలవరం మండలం లైన్ పేటలో గల అంబేద్కర్ విగ్రహానికి ఎంపీ హరీష్ బాలయోగి, ముమ్మిడివరం శాసనసభ్యులు మరియు ప్రభుత్వ విప్ దాట్ల సుబ్బరాజు (బుచ్చిబాబు )లు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా అంబేద్కర్ ఆశయాల కోసం కృషి చేయాలని హరీష్ బాలయోగి పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే చెల్లి వివేకానంద ఎస్సీ కార్పొరేషన్ డైరెక్టర్ చెల్లి అశోక్ ఐ పోలవరం తెలుగుదేశం అధ్యక్షులు సాగరాజు సూరిబాబు రాజు కూటమి నాయకులు కార్యకర్తలు తదితరులు ఉన్నారు