పత్తిపాక గ్రామ సభలో వార్డుల సమస్యలపై వినతిపత్రం
జనం న్యూస్ జూన్ 30 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండలంలోని పత్తిపాక గ్రామంలో నిర్వహించిన గ్రామ సభలో 11, 12 వార్డుల కాలనీ వాసులు తమ ప్రాంతంలో నెలకొన్న పలు సమస్యలను పరిష్కరించాల ని కోరుతూ గ్రామ సర్పంచ్ గజ్జి ఐలయ్య, ఉపసర్పంచ్ తుడుం రాజు,పంచాయతీ కార్యదర్శి రాజారాం లకు వినతిపత్రం అందజేశారు.11, 12 వార్డుల్లోని ఈరమ్మ గండిలలో నీరు నిల్వ ఉండకుండా ప్రవహించేలా చర్యలు తీసుకోవాలని, వట్టి వలన దోమల వ్యాప్తితో ప్రజలు అనారోగ్యానికి గురయ్యే ప్రమాదం ఉందని కాలనీ వాసులు ఆందోళన వ్యక్తం చేశారు.అదేవిధంగా 11వ వార్డులో నివాస గృహాలపై నుంచి 11 కేవీ విద్యుత్ లైన్లు వెళ్లడం,ఇళ్ల మధ్యలో ట్రాన్స్‌ఫార్మర్ ఉండటంతో తరచూ ఎర్త్ రిటర్న్ సమస్య ఏర్పడుతోందని తెలిపారు.దీంతో బల్బులు, టీవీలు, ఫ్రిజ్‌లు, ఫ్యాన్లు వంటి విద్యుత్ పరికరాలు దెబ్బతింటున్నాయని పేర్కొన్నారు.ఈ సమస్యలను అధికారులు వెంటనే పరిష్కరించి గ్రామ ప్రజలు ఇబ్బందులు తొలగించాలని గ్రామ సభలో కాలనీ వాసులు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో వార్డ్ మెంబర్ కందగట్ల ప్రవీణ్ కుమార్, పిఏసియస్ డైరెక్టర్ కందగట్ల ప్రకాశం, అరుణ, కళావతి, చల్ల లక్మి, వంగ మమత,బంక ప్రవీణ్, బూర జనార్ధన్, శేఖర్,కుసుమ రమేష్, ఇందుతేజ, రాజయ్య తదితరులు పాల్గొన్నారు…..