ఆంజనేయ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతి రెడ్డి
(జనం న్యూస్ మే 11 కందిబండ హరీష్ మునగాల మండల) మునగాల మండల పరిధిలోని తిమ్మారెడ్డి గూడెంలోని ఆంజనేయ స్వామి దేవాలయంలో సోమవారం కోదాడ ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతి రెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఆలయానికి చేరుకున్న ఎమ్మెల్యేకు దేవస్థాన కమిటీ సభ్యులు, గ్రామస్థులు ఘన స్వాగతం పలికారు.అనంతరం స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు, అర్చనలు నిర్వహించి రాష్ట్ర ప్రజలు సుఖశాంతులతో ఉండాలని ప్రార్థించారు. ఈ సందర్భంగా ఆలయ అభివృద్ధికి ప్రభుత్వం సహకారం అందిస్తుందని ఎమ్మెల్యే తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ నాయకులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు.