నందలూరు తాసిల్దార్ కార్యాలయంలో దరఖాస్తులు గల్లంతు
జనం న్యూస్ నందలూరు కడప జిల్లా. నందలూరు మండలంలో ని తాసిల్దార్ కార్యాలయం లో గత కొన్నినెలలుగా దరఖాస్తులుమాయమవుతున్నాయని పలువురు చెబుతున్నారు. కార్యా లయ సిబ్బంది నిర్లక్ష్యం వల్ల పలుమార్లు దర ఖాస్తులు ఇచ్చిన వాటిని జాగ్రత్త చేయకపోవడం పలు విమర్శలకు దారి తీస్తుందని బాధితులు వాపోతున్నారు. మండ లంలోని పాత్రికేయుల దరఖాస్తులు కూడా ఇటీవలగల్లంతయ్యాయి. గతంలో పనిచేసిన ఇద్దరు తాసిల్దార్లకి దరఖాస్తు చేసు కున్నప్పటికీ ప్రస్తుతం అవి ఎక్కడున్నాయో తెలియక పాత్రికేయులు విష్మయం వ్యక్తం చేస్తున్నారు.సిబ్బంది ని ఎవరిని అడిగినా ఇదిగో వాళ్ల దగ్గర ఉన్నాయి, వీళ్ల దగ్గర ఉన్నాయి అని చెప్తూ చివరికి మా దగ్గర లేవు అనే సమాధానం తప్ప వేరే ఆలోచన లేదు. ప్రస్తుతం ఉన్న తాసిల్దార్ అయినా శ్రద్ధ వహించి దరఖాస్తుల ను భద్రపరిచి సకాలంలో వాటిని పూర్తి చేయవల సిందిగా మండల ప్రజలు కోరుతున్నారు.