పెబ్బేరు, ప్రభుత్వ మహిళా పాలిటెక్నిక్ కళాశాల లో స్పాట్ అడ్మిషన్లకు దరఖాస్తులు
జనం న్యూస్ : వనపర్తి డివిజన్ రీపోటర్ కటికల శివకుమార్ వనపర్తి జిల్లా పెబ్బేరు 01-07-2026 బుధవారం తెలంగాణ పాలిసెట్ -2026 ప్రవేశాల అనంతరం మిగిలిన ఖాళీ సీట్ల భర్తీకి ప్రభుత్వం విడుదల చేసిన షెడ్యూల్ ప్రకారం మహిళా పాలిటెక్నిక్ కళాశాల పెబ్బేర్ లో స్పాట్ అడ్మిషన్ నిర్వహించనున్నట్టు కళాశాల ప్రిన్సిపాల్ శ్రీ జయచంద్ర తెలిపారు. స్పాట్ అడ్మిషన్ షెడ్యూల్:1)ఖాళీ సీట్ల ప్రదర్శన – జూన్ 30 20262 ) దరఖాస్తులు స్వీకరించు తేదీలు :జూలై 1 నుండి జూలై 3 వ తేదీ వరకుస్పాట్ అడ్మిషన్ నిర్వహించు తేదీ: జులై 4న స్పాట్ అడ్మిషన్ నిర్వహించబడును.అందుబాటులో ఉన్న ఖాళీ సీట్లు1) డిప్లమా ఇన్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ -02 ఖాళీలు2) డిప్లమా ఇన్ మల్టీమీడియా అండ్ ఎలక్ట్రానిక్ ఇంజనీరింగ్-51 సీట్లు కలవు.అభ్యర్థులు తప్పనిసరిగా స్వయంగా హాజరై, టి.జి. పాలిసెట్–2026 ర్యాంక్ కార్డు (అర్హత సాధించినవారికి), ఎస్.ఎస్.సి. మార్కుల మెమో, 4వ తరగతి నుండి 10వ తరగతి వరకు స్టడీ సర్టిఫికెట్లు, ట్రాన్స్‌ఫర్ సర్టిఫికేట్ (టి.సి.), అవసరమైతే కుల ధ్రువీకరణ పత్రం, నివాస ధ్రువీకరణ పత్రం తదితర అసలు ధ్రువపత్రాలతో పాటు వాటి జిరాక్స్ ప్రతులను తీసుకురావాలని పూర్తి వివరాల కొరకు అభ్యర్థులు కళాశాలను సందర్శించగలరని మనవి.