ఎస్‌బీఐ క్యాషియర్ ఈశ్వరప్పకుమున్సిపల్ చైర్మన్ అక్కి శ్రీనివాస్ గౌడ్ ఘన సన్మానం
జనం న్యూస్ : వనపర్తి డివిజన్ రీపోటర్ కటికల శివకుమార్ వనపర్తి జిల్లా పెబ్బేరు గురువారం 2-7-2026 పెబ్బేరు, శ్రీరంగాపురం ఎస్‌బీఐ బ్యాంకు క్యాషియర్‌గా సేవలందించి పదవీ విరమణ చేసిన ఈశ్వరప్పను మున్సిపల్ చైర్మన్ అక్కి శ్రీనివాస్ గౌడ్ బుధవారం ఘనంగా సన్మానించారు. సహారా ఫంక్షన్ హాల్ లో ఏర్పాటు చేసిన వీడ్కోలు కార్యక్రమంలో చైర్మన్ అక్కి శ్రీనివాస్ గౌడ్ ముఖ్య అతిథిగా పాల్గొని ఈశ్వరప్పను శాలువాతో ఘనంగా సన్మానించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మూడు దశాబ్దాలకు పైగా నిబద్ధత, నిజాయితీతో బ్యాంకింగ్ సేవలందించిన ఈశ్వరప్ప నేటి యువ ఉద్యోగులకు ఆదర్శమని కొనియాడారు. ఖాతాదారులతో మర్యాదగా మెలిగి బ్యాంకుకు మంచి పేరు తెచ్చారని అన్నారు.ఎస్‌బీఐ మేనేజర్, సిబ్బంది ఈశ్వరప్ప సేవలను గుర్తు చేసుకుని ఆత్మీయ వీడ్కోలు పలికారు.కార్యక్రమంలో మార్కెట్ వైస్ చైర్మన్ విజయవర్ధన్ రెడ్డి, డైరెక్టర్ రామన్ గౌడు, సురేందర్ గౌడు రణధీర్ రెడ్డి బుర్రమోని రాముడు యాదవ్, న్యాయవాది శ్రీనివాస్ గౌడ్, పట్టణ ప్రముఖులు, వ్యాపారులు, ఈశ్వరప్ప కుటుంబ సభ్యులు, మిత్రులు పాల్గొని శుభాకాంక్షలు తెలిపారు.END