పాపారాయుడు నగర్‌లో మూడో రోజుకు చేరుకున్న ఎస్‌ఐఆర్ ఓటరు ధృవీకరణ ప్రక్రియ ధృవీకరణ కార్యక్రమంలో పాల్గొన్న కాలనీ జనరల్ సెక్రెటరీ దోంతిరి భాస్కర్ రెడ్డి
జనం న్యూస్, జూలై 3 | తెలంగాణ స్టేట్ ఇంచార్జ్: శ్రీనివాస్ రెడ్డి : భారత ఎన్నికల సంఘం చేపట్టిన ప్రత్యేక ఓటరు జాబితా సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్) కార్యక్రమంలో భాగంగా పాపారాయుడు నగర్ కాలనీలో నిర్వహిస్తున్న ఓటరు ధృవీకరణ (వెరిఫికేషన్) ప్రక్రియ మూడో రోజుకు చేరుకుంది. కాలనీలోని కమిటీ హాల్ దగ్గర కొనసాగుతున్న ఈ కార్యక్రమంలో కాలనీ జనరల్ సెక్రెటరీ దోంతిరి భాస్కర్ రెడ్డి పాల్గొని ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా భాస్కర్ రెడ్డి మాట్లాడుతూ, కాలనీలోని అర్హులైన ప్రతి ఓటరు తప్పనిసరిగా తమ ఓటరు గుర్తింపు కార్డు (వోటర్ ఐడీ)తో కమిటీ హాల్‌కు వచ్చి తమ వివరాలను ధృవీకరించుకోవాలని కోరారు. ఓటరు జాబితాలో ఎలాంటి తప్పులు, లోపాలు లేకుండా ఉండేందుకు ఈ ప్రక్రియ ఎంతో కీలకమని, ప్రతి ఒక్కరూ బాధ్యతగా పాల్గొనాలని సూచించారు.అదేవిధంగా, ఓటరు జాబితాలో పేర్లు, చిరునామాలు లేదా ఇతర వివరాల్లో మార్పులు, చేర్పులు అవసరమైతే వెంటనే సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి సవరణలు చేయించుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఎన్నికల సంఘం చేపట్టిన ఈ ప్రత్యేక కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి కాలనీ ప్రజలు సంపూర్ణ సహకారం అందించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బిఎల్ఓలు కనకదుర్గ అంజలి కాలనీవాసులు విష్ణు రావు, లక్ష్మణరావు, నాగేందర్, మధు, చందు రావుతో పాటు పలువురు కాలనీ ప్రతినిధులు, నివాసితులు పాల్గొన్నారు.