డాక్టర్ కే. శరత్ కమల్ కు ‘జాతీయ ఉత్తమ సేవా రత్న’ పురస్కారం

July 3, 2026 | తెలంగాణ

జనం న్యూస్ నందలూరు కడప జిల్లా 03-07-26 సబ్ టైటిల్:- ​ఘనంగా సన్మానించిన హెచ్.ఆర్.పి.సి.ఐ కడప జిల్లా చైర్మన్ డాక్టర్ వి. డేవిడ్ ​నందలూరు (కడప జిల్లా): వైద్యో నారాయణో హరిః అనే నానుడిని నిజం చేస్తూ, ప్రజా ఆరోగ్య రక్షణలో నిరంతరం శ్రమిస్తున్న నందలూరు మండల ప్రభుత్వ వైద్యశాల ప్రధాన వైద్యాధికారి డాక్టర్ కె. శరత్ కమల్ కు ప్రతిష్టాత్మక “జాతీయ ఉత్తమ సేవా రత్న” (గౌరవ జాతీయ అవార్డు) లభించింది. జాతీయ వైద్యుల దినోత్సవాన్ని పురస్కరించుకుని హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో అతనికి ఈ అవార్డును అందజేసి ఘనంగా సన్మానించారు.​హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా జాతీయ అధ్యక్షులు తాళ్లూరి ప్రసన్న కుమార్ ఆదేశాల మేరకు. కడప జిల్లా చైర్మన్ డాక్టర్ వి. డేవిడ్ చేతుల మీదుగా డాక్టర్ శరత్ కమల్ కు ఈ ఉన్నత పుర స్కారాన్ని అందజేశారు. నందలూరు ప్రభుత్వ వైద్య శాలలో ప్రధాన వైద్యులుగా బాధ్యతలు చేపట్టిన నాటి నుండి డాక్టర్ శరత్ కమల్ రోగులకు అందిస్తున్న అంకితభావంతో కూడిన సేవలను, అతని మానవతా దృక్పథాన్ని గుర్తించి సంస్థ ఈ అవార్డుకు ఎంపిక చేసినట్లు నిర్వాహకులు తెలిపారు.​డాక్టర్ కార్తీక్ విశ్వనాథ్ కు కూడా గౌరవ సన్మానం ​ఈ కార్యక్రమం సందర్భంగా వైద్య రంగంలో విశేష సేవలందిస్తున్న మరో ప్రముఖ వైద్యులు డాక్టర్ కార్తీక్ విశ్వనాథ్ ను కూడా నందలూరు రైల్వే కన్సల్టెంట్ మెంబర్ రాచూరి మురళి శాలువాతో ఘనంగా సత్కరించి, గౌరవ వందనం సమర్పించారు.​విజయవంత మైన కార్యక్రమంలో పాల్గొన్న ప్రముఖులు​వైద్యులను ఘనంగా సన్మానించిన ఈ కార్యక్రమంలో పలువురు రాజకీయ, సామాజిక రంగాల ప్రముఖులు పాల్గొని డాక్టర్ శరత్ కమల్ ను అభినందించారు. ఈ కార్యక్రమం లో ​ఆండ్ర శివారెడ్డి (నందలూరు డీసీసీ బ్యాంక్ డైరెక్టర్)​పఠాన్ మెహర్ ఖాన్,​భాను ప్రకాష్ రాజు (ఒంటిమిట్ట మండలం బీజేపీ అధ్యక్షులు)​మరియునందలూరు ప్రభుత్వ వైద్యశాల సిబ్బంది, స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారని హెచ్.ఆర్.పి.సి.ఐ జిల్లా చైర్మన్ డాక్టర్ వి. డేవిడ్ ఒక ప్రకటనలో తెలియజేశారు.ఈ సందర్భంగా అవార్డు గ్రహీత డాక్టర్ శరత్ కమల్ మాట్లా డుతూ,తన సేవలని గుర్తించి ఈ జాతీయ అవార్డును అందించి నందుకు హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా వారికి ప్రత్యేక కృతజ్ఞతలుతెలిపారు.ఈ పురస్కారం తన బాధ్యతను మరింతపెంచిందని,భవిష్యత్తులో ప్రజలకు మరిన్ని మెరుగైన వైద్య సేవలు అందిస్తానని పేర్కొన్నారు.

🌐 Select Language:
📰 ePaper