అలంపూర్ నియోజకవర్గ శాసనసభ్యులు విజయుడు కి వినతిపత్రం అందజేసిన

జనం న్యూస్ 04 జూలై 2026 జిల్లా బ్యూరో ఇన్చార్జి జోగులాంబ గద్వాల్ జిల్లా విష్ణు వర్ధన్ గౌడ్ : అలంపూర్ ప్రభుత్వ జూనియర్ కళాశాల యాజమాన్యం అలంపూర్ లోని ప్రభుత్వ జూనియర్ కళాశాల నందు పలు అభివృద్ధి కార్యక్రమాల కోసం కళాశాల ప్రిన్సిపాల్ సమస్యలను అలంపూర్ ఎమ్మెల్యే విజయుడు కి వినతిపత్రం ద్వారా తెలియజేయడం జరిగింది. కళాశాలలో పాత భవనాలు కూల్చివేత మరియు నూతన కోర్స్ ( మల్టీపర్పస్ హెల్త్ వర్కర్ ) అందుబాటులోకి తేవడం. కళాశాల చుట్టు ప్రహరీ గోడ నిర్మాణం గురించి అందించడం జరిగింది. తర్వాత ఎమ్మెల్యే కి శాలువాతో సన్మానం చేసి పూల కుండీ అందజేశారు.అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ తరగతి గదిలోనే దేశ భవిష్యత్తు ఉంటుంది అని తెలియజేశారు. ఈ విషయమై సానుకూలంగా స్పందిస్తూ పై అధికారుల దృష్టికి విషయాన్ని తీసుకెళ్తానని తెలియజేశారు. కళాశాలలో ఉన్న లైబ్రరీని మరియు డిజిటల్ క్లాసులను సందర్శించారు ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ కళాశాల సిబ్బంది,మున్సిపల్ కమిషనర్ మున్సిపల్ చైర్మన్ వైస్ చైర్మన్ కౌన్సిలర్లు మరియు బిఆర్ఎస్ సీనియర్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు