ఘనంగా అల్లూరి సీతారామరాజు జయంతి
జనం న్యూస్, జూలై 04,అచ్యుతాపురం: అచ్యుతాపురం శాఖ గ్రంథాలయంలో స్వాతంత్ర్య సమరయోధుడు, మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు 129వ జయంతి సందర్భంగా అల్లూరి చిత్రపటానికి గ్రంథాలయ అధికారి ఎల్ వి రమణ పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో డివైఎఫ్ఐ మాజీ నాయకులు ఆర్ రాము మాట్లాడుతూ అల్లూరి సీతారామరాజు అతి చిన్న వయస్సులను బ్రిటిష్ పాలకులపై స్వతంత్ర పోరాటం చేశారని ప్రజల యొక్క హక్కులు బాధ్యతలు తెలియజేసి చైతన్యవంతులు చేశారని ఆయనను స్ఫూర్తిగా తీసుకొని యువకులు హక్కులు సాధించుకోవచ్చు అని తెలిపారు.అల్లూరి త్యాగం, ధైర్యం, దేశభక్తి భారత జాతికి చిరస్మరణీయమని అన్నారు.ఈ కార్యక్రమంలో సీఐటీయూ నాయకులు కె సోము నాయుడు,సామాజిక కార్యకర్త పి శివ కృష్ణ,పాఠకులు ఎం రాజేష్, లోవ కుమార్, ధనరాజ్, దుర్గాప్రసాద్, పావని,శైలజ,చిన్నారావు తదితరులు పాల్గొన్నారు.