ఓటరు జాబితా సవరణ వేగవంతం చేయాలి బి రాజేశ్వరరావు

July 4, 2026 | ఆంధ్రప్రదేశ్

జనం న్యూస్ జూలై 4 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ : డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాకాట్రేనికోన మండల పరిషత్ అభివృద్ధి అధికారి బి రాజేశ్వరావు బూత్ స్థాయి అధికారులతో సమీక్ష నిర్వహించారు. ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమంలో భాగంగా ఓటరు జాబితా డిజిటల్ ప్రక్రియను పారదర్శకంగా, వేగవంతంగా పూర్తి చేయాలని ఆదేశించారు .ఓటరు జాబితా సమగ్ర సవరణ పురోగతిపై అధికారులతో చర్చించారు. తక్కువ ప్రగతి చూపిన బూత్ స్థాయి అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల విధుల్లో అలసత్వం వహిస్తే శాఖాపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. అన్ని బూతుల్లో క్షేత్రస్థాయిలో పరిశీలన చేసి అర్హులైన ప్రతి ఒక్కరి పేరు నమోదు చేయాలని సూచించారు.ఈ కార్యక్రమంలో పల్లంకుర్రు, పల్లం గ్రామ పంచాయతీల కార్యదర్శులు రామారావు, శాంతి స్వరూప్, స్వర్ణ తో పాటు గ్రామ సిబ్బంది పాల్గొన్నారు.

🌐 Select Language:
📰 ePaper