ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే జీఎస్సార్
జనం న్యూస్ జులై 4 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట మండల కేంద్రంలోని రైతు వేదికలో సీఎం రిలీఫ్ ఫండ్ (సీఎంఆర్ఎఫ్) 30వ విడత చెక్కుల పంపిణీ కార్యక్రమం ఘనంగా నిర్వహించబడింది.ఈ కార్యక్రమంలో భూపాలపల్లి నియోజకవర్గం ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు పాల్గొని మండలానికి చెందిన 27 మంది లబ్ధిదారులకు ముఖ్యమంత్రి సహాయ నిధి 6,85,500/- రూపాయల విలువ గల చెక్కులను అందజేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం వైద్య రంగానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకంలో కవర్ కాని పేద ప్రజలు సీఎం రిలీఫ్ ఫండ్ కింద దరఖాస్తు చేసుకుంటే ప్రభుత్వం నుంచి ఆర్థిక సహాయం అందజేస్తున్నట్లు పేర్కొన్నారు. అలాగే ఆరోగ్యశ్రీ పథకం కింద చికిత్స పరిమితిని రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షలకు పెంచడం జరిగిందని తెలిపారు. నిమ్స్ ఆసుపత్రిలో చేరి ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న పేద రోగులకు ఆసుపత్రి నుంచి ఎస్టిమేషన్ కాపీ సమర్పించి నట్లయితే ప్రభుత్వం తరఫున ఎల్.ఓ.సీ మంజూరు చేసి చికిత్సకు అవసరమైన సహాయాన్ని అందిస్తోందని చెప్పారు.పేద ప్రజలకు నాణ్యమైన విద్య,వైద్య సేవలు అందించడమే రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ఎమ్మెల్యే స్పష్టం చేశారు.ఈ కార్యక్రమంలో మండల తహసీల్దార్ ప్రవీణ్ కుమార్ ఎంపీడీవో పాణి చంద్ర గ్రామ సర్పంచ్ చింతల ఉమా రవిపాల్ మాజీ ఎంపీపీ బాసాని చంద్ర ప్రకాష్ కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు దుదిపాల బుచ్చిరెడ్డి తెలంగాణ కొమురయ్య మండలానికి లబ్ధిదారులు కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు…..