హైదరాబాద్‌లో ఆల్ ఇండియా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు అల్కా లాంబాతో డీసీసీ కార్యదర్శి శిరీష సత్తూరు భేటీ.

July 5, 2026 | తెలంగాణ

జనం న్యూస్ జూలై 5 తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ శ్రీనివాస్ రెడ్డి ఆల్ ఇండియా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు ఆల్కా లంబ హైదరాబాద్ పర్యటన సందర్భంగా నిర్వహించిన “నేషనల్ లీగల్ కాన్‌క్లేవ్ – సంవిధాన్ సభ: తెలంగాణ చాప్టర్” కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మహిళల నాయకత్వం, రాజ్యాంగ పరిరక్షణ, న్యాయ పాలన బలోపేతం మరియు ప్రజాస్వామ్య విలువల పరిరక్షణపై ఆమె తన అభిప్రాయాలను వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా రంగారెడ్డి జిల్లా డీసీసీ కార్యదర్శి శిరీష సత్తూరు ఆల్ ఇండియా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు అల్కా లాంబా గారిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ భేటీలో తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌చార్జ్ కమలాక్షి తెలంగాణ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు స్వర్ణ మహిళా కాంగ్రెస్ వైస్ ప్రెసిడెంట్ రేఖ బోయలపల్లి మాజీ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సునీతా రావు ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ పాల్గొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా మహిళా కాంగ్రెస్‌ను మరింత బలోపేతం చేయడం, మహిళల రాజకీయ సాధికారతకు ప్రాధాన్యత ఇవ్వడం, రాజ్యాంగ విలువలను పరిరక్షిస్తూ ప్రజాస్వామ్యాన్ని మరింత పటిష్టం చేసే దిశగా కలిసి పనిచేయాలని నాయకులు అభిప్రాయపడ్డారు.ఈ సమావేశాలు మహిళా కాంగ్రెస్ సంస్థాగత విస్తరణ, మహిళల రాజకీయ భాగస్వామ్యం పెంపు మరియు కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి దోహదపడేలా జరిగాయని శిరీష సత్తూరు తెలిపారు.

🌐 Select Language:
📰 ePaper