ePaper

చిరంజీవి విశ్వంభర జూలైలో విడిదల…?

May 3, 2026 | సినిమా వార్తలు

జనం న్యూస్: చిరంజీవి విశ్వంభర సినిమా విడుదలకు రంగం సిద్ధమైందా? అన్ని అనుకున్నట్టు జరిగితే జులై లోనే విడుదలా? లేటెస్ట్ గా వస్తున్న వార్తల్లో నిజమెంత? బింబిసార వంటి హిట్టు సినిమాను అందించి ఏకంగా రెండో సినిమా ఛాన్స్ మెగాస్టార్ తో పట్టేసాడు విశ్వంభర దర్శకుడు మల్లిడి వశిష్ఠ. ముందే ప్లాన్ చేసినట్టు జరిగుంటే సినిమా ఈ పాటికి ఎప్పుడో విడుదలవ్వాలి. కానీ ఫస్ట్ టీజర్ విడుదల తర్వాత క్వాలిటీ విషయంలో భయంకరంగా ట్రోలింగ్ జరగడంతో వేరే కారణాలను చూపెట్టి సినిమా విడుదలను వాయిదా వేసింది టీం. ఇక ఆ తరువాత రిలీజ్ విషయంలో ఎటువంటి సౌండ్ లేదు. దాంతో ఈ సినిమా విషయంలో రకరకాల రూమర్లు స్ప్రెడ్ అయ్యాయి. ఈలోగా చిరంజీవి మన శంకర వర ప్రసాద్ గారు సినిమాను పూర్తి చేసి భారీ హిట్టునందుకున్నారు. వేరే సినిమాలను కూడా లైన్లో పెట్టారు. ఇక విశ్వంభర సినిమా షూటింగ్ ఎంత వరకు వచ్చిందో ఈ మధ్యకాలంలో ఎటువంటి అప్డేట్ లేదు. కట్ చేస్తే ఇప్పుడు ఈ సినిమాను జూలై 10 న విడుదలకు సన్నాహాలు చేస్తున్నట్లు వార్తలు మొదలయ్యాయి. నిజానికి గతేడాది చిరంజీవి పుట్టిన రోజు సందర్భంగా ఈ చిత్రానికి సంబంధించి ఒక గ్లింప్స్ విడుదల చేసారు. ఆ సందర్భంగా చిరంజీవి విశ్వంభర విశేషాలు చెప్తూ ఒక స్పెషల్ వీడియో రిలీజ్ చేసారు. ఆ వీడియోలో క్వాలిటీ విషయంలో రాజీపడటం లేదనీ, అందరికీ నచ్చే ఒక విజువల్ వండర్ ను తీర్చిదిద్దుతున్నామంటూ ఆ సినిమా మీద వస్తున్న పుకార్లకు చెక్ పెట్టె ప్రయత్నం చేసారు. 2026 సమ్మర్ లో సినిమా విడుదల అంటూ ఒక లీక్ కూడా ఇచ్చారు. మరి అయన చెప్పిన సమ్మర్ వచ్చేసింది.