శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆశీస్సులతో రాష్ట్ర ప్రజలందరూ సుఖశాంతులతో ఉండాలి – టీపీసీసీ వైస్ ప్రెసిడెంట్, కూకట్‌పల్లి కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్, తెలంగాణ రాష్ట్ర కమ్మ కార్పొరేషన్ చైర్మన్ బండి రమేష్
జనం న్యూస్ జూలై 8 తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ శ్రీనివాస్ రెడ్డి కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామివారి అనుగ్రహం ప్రజలందరిపైన ఉండాలని టీపీసీసీ వైస్ ప్రెసిడెంట్, కూకట్‌పల్లి కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ మరియు తెలంగాణ రాష్ట్ర కమ్మ కార్పొరేషన్ చైర్మన్ బండి రమేష్ ఆకాంక్షించారు.గాయత్రినగర్ డివిజన్ పరిధిలోని వివేకానందనగర్‌లో శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి దేవస్థాన ప్రాంగణంలో కొలువైన శ్రీశ్రీ భూ సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి 14వ వార్షిక బ్రహ్మోత్సవం సందర్భంగా ఆలయ కమిటీ చైర్మన్ పులిగోళ్ల శ్రీనివాస్ యాదవ్ మరియు ఆలయ పాలకవర్గ సభ్యుల ఆహ్వానం మేరకు ముఖ్య అతిథిగా పాల్గొని స్థానిక నాయకులతో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించిన టీపీసీసీ వైస్ ప్రెసిడెంట్, కూకట్‌పల్లి కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ మరియు తెలంగాణ రాష్ట్ర కమ్మ కార్పొరేషన్ చైర్మన్ బండి రమేష్ అనంతరం ఆలయ కమిటీ సభ్యులు బండి రమేష్ ని శాలువాతో ఘనంగా సత్కరించారు.ఈ కార్యక్రమంలో. గొట్టుముక్కల వెంకటేశ్వరరావు, వేముల సత్యం, మస్తాన్ రెడ్డి, శ్రీనివాస యాదవ్,ఆలయ కమిటీ సభ్యులు, కాలనీ వాసులు, భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.