కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు అమరం కృష్ణారెడ్డి మృతి పట్ల బండి రమేష్ నివాళి.

July 9, 2026 | తెలంగాణ

జనం న్యూస్ జూలై 9 తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ శ్రీనివాస్ రెడ్డి : బేగంపేటకు చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు అమరం కృష్ణారెడ్డి గురువారం పరమపదించారు. ఈ విషాద వార్త తెలుసుకున్న టీపీసీసీ ఉపాధ్యక్షుడు, తెలంగాణ రాష్ట్ర కమ్మ కార్పొరేషన్ చైర్మన్, కూకట్‌పల్లి కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జ్ బండి రమేష్ స్థానిక నాయకులతో కలిసి కృష్ణారెడ్డి నివాసానికి వెళ్లి ఆయన భౌతిక కాయానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు.అనంతరం కృష్ణారెడ్డి తనయుడు శ్రీనివాస్ రెడ్డిని కలిసి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ కుటుంబ సభ్యులను ఓదార్చారు. ఈ క్లిష్ట సమయంలో ధైర్యంగా ఉండాలని వారికి భరోసా కల్పించారు.ఈ సందర్భంగా బండి రమేష్ మాట్లాడుతూ, అమరం కృష్ణారెడ్డి పార్టీ పట్ల అంకితభావంతో ఎంతోకాలం సేవలందించిన సీనియర్ నాయకుడని, ఆయన చేసిన సేవలను కాంగ్రెస్ పార్టీ ఎప్పటికీ గుర్తుంచు కుంటుందని అన్నారు. దివంగత అమరం కృష్ణారెడ్డి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ, వారి కుటుంబ సభ్యుల కు తన ప్రగాఢ సంతాపాన్ని తెలియజేశారు.ఈ కార్యక్రమంలో గొట్టుముక్కల వెంకటేశ్వరరావు, రమేష్, కరుణాకర్, విశాల్, భరత్, ఆలీ, సుజిత్ గౌడ్, అరుణ్, సురేష్, రమాదేవి, సురేష్ బాబు, అభిషేక్ తదితరులు పాల్గొని అమరం కృష్ణారెడ్డి కి ఘన నివాళులు అర్పించారు.

🌐 Select Language:
📰 ePaper