జాతీయ భావంతో విద్యార్థులు పనిచేయాలి: అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ నాయకులు అత్తిలి వినయ్
జనం న్యూస్ జూలై 9 ముమ్మిడివరం (ప్రతినిధి గ్రంధి నానాజీ) డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాఅమలాపురం :
అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఆవిర్భావ దినోత్సవం పురస్కరించుకుని స్థానిక ఎర్రవంతెన వద్ద కలది అమలాపురం జూనియర్ కళాశాలలో జాతీయ విద్యార్థి దినోత్సవం ఘనంగా జరిగింది. కళాశాల ప్రధానాచార్యులు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ రాష్ట్ర కార్యసమితి సభ్యులు అత్తిలి వినయ్ పాల్గొన్నారు.ఈ సందర్భంగా వినయ్ మాట్లాడుతూ, 1949 జూలై 9న ప్రారంభమైన అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ నేడు 78వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను దేశవ్యాప్తంగా నిర్వహిస్తోందని తెలిపారు. జ్ఞానం, శీలం, ఏకతలను ఆశయ, ఆదర్శంగా అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ పనిచేస్తుందన్నారు. విద్యారంగ సమస్యల పరిష్కారం కోసం ఆందోళనలు నిర్వహించడంతో పాటు, ఆర్టికల్ 370 రద్దు, కాశ్మీర్, బంగ్లాదేశ్ అక్రమ చొరబాటుదారుల సమస్య, నక్సలైట్లకు వ్యతిరేకంగా అనేక జాతీయ ఉద్యమాలను విద్యార్థుల ద్వారా నిర్వహించి వారిని దేశభక్తి కలిగిన పౌరులుగా తీర్చిద్దిందన్నారు.దేశవ్యాప్తంగా 80 లక్షల సభ్యత్వంతో అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ అతిపెద్ద విద్యార్థి సంఘంగా పేరుగాంచిందన్నారు. అందుకే అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఆవిర్భావ దినోత్సవాన్ని జాతీయ విద్యార్థి దినోత్సవంగా దేశవ్యాప్తంగా జరుపుకుంటున్నామని చెప్పారు. ఈనెల 6వ తేదీ నుండి 12వ తేదీ వరకు వారం రోజుల పాటు 78వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను విద్యార్థుల ర్యాలీలు, సేవా కార్యక్రమాలు, రక్తదాన శిబిరాలు, మొక్కలు నాటే కార్యక్రమాలు చేపట్టి దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్నామన్నారు.విద్యార్థులు అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ తో కలిసి జాతీయ భావం, సేవా దృక్పథంతో పనిచేయాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో విద్యార్థులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ అమలాపురం శాఖ కార్యకర్తలు నరసింహ, శ్రీనివాస్ తదితరులు నాయకత్వం వహించారు