అక్రమ కట్టడాల కూల్చివేత

July 10, 2026 | వైరల్ వార్తలు

జనం న్యూస్ 10 జూలై 2026 జిల్లా బ్యూరో ఇన్చార్జి జోగులాంబ గద్వాల్ జిల్లా విష్ణు వర్ధన్ గౌడ్ జోగుళాంబ గద్వాల జిల్లా అలంపూర్ నియోజకవర్గం అయిజ పట్టణ అంబేద్కర్ ఎదురుగా ప్రభుత్వ భూముల్లో చేపడుతున్న అక్రమ నిర్మాణాలను శుక్రవారం రెవెన్యూ మున్సిపల్ అధికారులు కూల్చివేయించారు తహసీల్దార్‌ జ్యోతి,కమిషనర్ చంద్రశేఖర్ రావు,ఆదేశాల మేరకు రెవెన్యూ మున్సిపల్ సిబ్బంది మరియు పోలీస్ బందోబస్తుతో వాగు ప్రభుత్వ భూముల్లో కొన్ని రోజులుగా చేపడుతున్న నిర్మాణాలను జేసీబీతో కూల్చివేయించారు. ఈ సందర్భంగా తహసీల్దార్‌ మాట్లాడుతూ ప్రభుత్వ భూముల్లో అక్రమ నిర్మాణాలు చేస్తున్న వారిపై క్రిమినల్‌ కేసులు నమోదు చేయిస్తామన్నార అక్రమార్కులపై కఠినంగా వ్యవహరిస్తామని హెచ్చరించారు

🌐 Select Language:
📰 ePaper