తెలంగాణ

ప్రతి ఓటరు ఎస్‌ఐఆర్ ప్రక్రియను సకాలంలో పూర్తి చేయాలి: కాంగ్రెస్ నాయకుడు చిట్టిరెడ్డి శ్రీధర్ రెడ్డి

ప్రతి ఓటరు ఎస్‌ఐఆర్ ప్రక్రియను సకాలంలో పూర్తి చేయాలి: కాంగ్రెస్ నాయకుడు చిట్టిరెడ్డి శ్రీధర్ రెడ్డి

జనం న్యూస్, జూలై 14: శేరిలింగంపల్లి నియోజకవర్గంలోని వెంకటేశ్వర నగర్ (కూకట్‌పల్లి) డివిజన్ పరిధిలో పాపిరెడ్డి నగర్ వాసులకు భారత ఎన్నికల ప్రక్రియలో భాగంగా కొనసాగుతున్న ఎస్‌ఐఆర్ పై కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు చిట్టిరెడ్డి శ్రీధర్ రెడ్డి అవగాహన కల్పించారు. ప్రతి అర్హత కలిగిన ఓటరు తమ ఎస్‌ఐఆర్ ఫారాలను పూర్తిగా నింపి, అవసరమైన ధ్రువపత్రాలతో సంబంధిత బీఎల్‌ఓలకు తప్పనిసరిగా సమర్పించాలని ఆయన పిలుపునిచ్చారు.శ్రీ వీరాంజనేయ శివాలయం కమ్యూనిటీ హాల్‌లో ప్రతిరోజూ బీఎల్‌ఓలు అందుబాటులో ఉండి దరఖాస్తులను స్వీకరిస్తున్నారని తెలిపారు. ఫారాలు నింపడంలో లేదా పత్రాల సమర్పణలో ఏవైనా సందేహాలు ఉంటే అక్కడ ఏర్పాటు చేసిన హెల్ప్‌డెస్క్‌ను సంప్రదించి సహాయం పొందవచ్చని పేర్కొన్నారు.ఈ సందర్భంగా స్థానిక ప్రజల సందేహాలను స్వయంగా నివృత్తి చేసిన శ్రీధర్ రెడ్డి, పలువురు ఓటర్లతో ఎన్యుమరేషన్ ఫారాలను పూర్తి చేయించి బీఎల్‌ఓలకు అందజేయించారు. ప్రతి ఓటరు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని, గడువులోగా ఎస్‌ఐఆర్ ప్రక్రియను పూర్తి చేయాలని ఆయన కోరారు.ఈ కార్యక్రమంలో ఈ రెడ్డి దేవేందర్ రెడ్డి, చిట్టిరెడ్డి గోపాల్ రెడ్డి, ఎసిరెడ్డి భూపాల్ రెడ్డి, టీవీ పద్మ, డాకురి అక్కిరెడ్డి, శోభకృష్ణా రెడ్డి, ప్రభాకర్, శ్రీనివాస్, బీఎల్‌ఓలు రాణి, స్వాతి, స్వర్ణలత, రజని, శకుంతల, సంగీత, శైలజలతో పాటు పలువురు బీఎల్‌ఏలు, కాంగ్రెస్ నాయకులు, స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

ఇ-పేపర్