జహీరాబాద్‌లో టీ వై జె ఎఫ్ ఐడీ కార్డుల పంపిణీ కార్యక్రమం ఘనంగా

July 15, 2026 | వైరల్ వార్తలు

జనం న్యూస్ మోహమ్మద్ ఇమ్రాన్ తెలంగాణ బ్యూరో ఇంచార్జ్ జులై 15 తెలంగాణ యూత్ జర్నలిస్ట్ ఫెడరేషన్ (టీ వై జె ఎఫ్) యూనియన్ ఆధ్వర్యంలో జహీరాబాద్ నియోజకవర్గ జర్నలిస్టులకు ఐడీ కార్డుల పంపిణీ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు.జహీరాబాద్ నియోజకవర్గ అధ్యక్షుడు జానారెడ్డి, ప్రధాన కార్యదర్శి మహమ్మద్ ఇమ్రాన్ ఆధ్వర్యంలో, టీ వై జె ఎఫ్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ జితేందర్ రావు తనుగుల ఆదేశాల మేరకు నిర్వహించిన ఈ కార్యక్రమానికి రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ షేక్ మహబూబ్ ముఖ్య అతిథిగా హాజరై జర్నలిస్టులకు ఐడీ కార్డులను పంపిణీ చేశారు.ఈ సందర్భంగా షేక్ మహబూబ్ మాట్లాడుతూ, జర్నలిస్టుల సంక్షేమమే టీ వై జె ఎఫ్ ప్రధాన లక్ష్యమని, రాష్ట్రవ్యాప్తంగా జర్నలిస్టులను సంఘటితం చేస్తూ వారి హక్కుల పరిరక్షణకు నిరంతరం కృషి చేస్తున్నామని తెలిపారు.ఈ కార్యక్రమంలో జహీరాబాద్ మున్సిపల్ చైర్మన్ యూనుస్, మున్సిపల్ కమిషనర్ ప్రభాకర్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు రామన్న, ఆమ్ ఆద్మీ పార్టీ జిల్లా ఇన్‌చార్జ్ రాజేశ్వర్, టీ వై జె ఎఫ్ సంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు కామగళ్ల నరేష్, జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ సంతోష్ కుమార్, జిల్లా ఆర్గనైజింగ్ సెక్రటరీ అబుబకర్, ఎన్‌ఎస్ ఛానల్ ఎండీ నర్సింలు, ఎడిటర్ శ్రీనివాస్, సంగారెడ్డి జిల్లా టీ వై జె ఎఫ్ జిల్లా సభ్యురాలు సంగీత, ఎగ్జిక్యూటివ్ సభ్యుడు ప్రవీణ్ కుమార్, అందోల్ నియోజకవర్గ అధ్యక్షుడు రాజు, జహీరాబాద్ నియోజకవర్గ ఉపాధ్యక్షుడు వీరేశం, సభ్యులు మహమ్మద్ సర్దార్ అలీ, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

🌐 Select Language:
📰 ePaper