రైతు సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం – పరిగి ఎమ్మెల్యే టీఆర్ఆర్

July 16, 2026 | తెలంగాణ

జనం న్యూస్ జూలై 16, వికారాబాద్ జిల్లా పూడూరు మండల కేంద్రంలోని పీఎసీఎస్ కార్యాలయంలో పీఎసీఎస్ చెర్మన్ పట్లోళ్ల రఘునాథ్ రెడ్డి ఆధ్వర్యంలో మండలంలోని పలు గ్రామాలకు చెందిన రైతులకు సుమారు రూ.40 లక్షల విలువైన గోల్డ్ లోన్ & ల్టీ లోన్ చెక్కులను పరిగి ఎమ్మెల్యే, టీపీసీసీ ట్రైనింగ్ కమిటీ చైర్మన్ డాక్టర్ టి.రామ్మోహన్ రెడ్డి స్థానిక నాయకులు, ప్రజాప్రతినిధులతో కలిసి పంపిణీ చేశారు.అనంతరం ఎమ్మెల్యే రైతులకు యూరియా ఎరువుల బస్తాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ,, రైతుల అభివృద్ధికి సహకార సంఘాలు అందిస్తున్న రుణ సదుపాయాలు ఎంతో ఉపయోగపడతాయని అన్నారు. రైతులు ఈ రుణాలను సద్వినియోగం చేసుకుని వ్యవసాయాభివృద్ధికి నియోగించుకోవాలని సూచించారు.రైతు సంక్షేమమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు.రైతులకు అవసరమైన ఎరువులు సకాలంలో అందేలా చర్యలు తీసుకుంటున్నామని,వ్యవసాయానికి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రభుత్వం కట్టుబడి పని చేస్తోందని తెలిపారు. ఈ కార్యక్రమంలో పీఎసీఎస్ చైర్మన్ పట్లోళ్ల రఘునాథ్ రెడ్డి ,ఆత్మ కమిటీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి ,వైస్ చైర్మన్ లు,పీఎసీఎస్ పాలకవర్గ సభ్యులు,ప్రజాప్రతినిధులు,అధికారులు,కాంగ్రెస్ నాయకులు,స్థానిక నాయకులు, రైతులు తదితరులు పాల్గొన్నారు.

🌐 Select Language:
📰 ePaper