నిన్న మన ఉదయ్ అసోసియేషన్ ప్రతినిధుల బృందం హోం మంత్రిత్వ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ని మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది

July 17, 2026 | తెలంగాణ

జనం న్యూస్ 17 జూలై 2026 జిల్లా బ్యూరో ఇన్చార్జి జోగులాంబ గద్వాల్ జిల్లా విష్ణు వర్ధన్ గౌడ్ ఉదయం టీం అసోసియేషన్ ఈ సందర్భంగా రాష్ట్రంలోని దివ్యాంగుల రక్షణ, ఆత్మ సంబంధించిన అత్యంత కీలకమైన అంశాలపై వారితో సుదీర్ఘంగా చర్చించాము.ప్రధానంగా కోరిన అంశాలు సెక్షన్ 92 బోర్డుల ఏర్పాటు: దివ్యాంగులను అవమానించినా, దూషించినా కఠిన శిక్షలు ఉంటాయని తెలిపే ఆర్ పి డబ్ల్యూ డి సెక్షన్ 2016 లోని ‘సెక్షన్ 92’ కి సంబంధించిన సమాచార బోర్డులను రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో పోలీస్ స్టేషన్లలో ప్రముఖంగా ప్రదర్శించేలా ఏర్పాటు చేయాలి.హోం శాఖలో అవేర్నెస్: దివ్యాంగులపై దౌర్జన్యాలు జరిగినప్పుడు పోలీసులు సాధారణ సెక్షన్లతో పాటు తప్పనిసరిగా సెక్షన్ 92 కింద కేసులు నమోదు చేసేలా మొత్తం పోలీస్ శాఖలో విస్తృతమైన అవగాహన కల్పించాలి.మన విజ్ఞప్తిపై హోం శాఖ సెక్రటరీ సానుకూలంగా స్పందిస్తూ దివ్యాంగుల రక్షణకు ప్రభుత్వం కట్టుబడి ఉందని, త్వరలోనే పోలీస్ శాఖ ద్వారా దీనిపై తగిన ఆదేశాలు మరియు సర్క్యులర్ జారీ అయ్యేలా చూస్తామని హామీ ఇచ్చారు.ఉదయ్ అసోసియేషన్.

🌐 Select Language:
📰 ePaper