డాక్టర్ జిల్లెల చిన్నారెడ్డి రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు ఆదేశాల మేరకు పెబ్బేరు ప్రభుత్వ డిగ్రీ కళాశాల లో 50 బెంచీల అందచేత
జనం న్యూస్ : వనపర్తి డివిజన్ రీపోటర్ కటికల శివకుమార్ పెబ్బేరు జులై 17-7-2026 శుక్రవారం పట్టణ కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థుల కోరిక మేరకు పేదల చిన్నారెడ్డి అన్న డాక్టర్ జిల్లెల మాధవ రెడ్డి గారి జ్ఞాపకార్థం వారి ట్రస్ట్ నుండి డాక్టర్ జిల్లెల చిన్నారెడ్డి గారు రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు విద్యార్థులకు బెంచీలు ఏర్పాటు చేయడం జరిగింది. వారు ఈరోజు పట్టణ కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు బెంచీలను కళాశాల యజమాన్యానికి అందజేయాలని పిలుపుమేరకు డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ కు అందజేయడం జరిగింది.ఇట్టి కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ సుమిత్ర ఎల్లారెడ్డి గారు, అయ్యవారిపల్లి సర్పంచ్ కురుమయ్య,రాంపురం సహదేవుడు,సత్యనారాయణ రెడ్డి,తోమలపల్లి కృపాకర్ రెడ్డి, గుమ్మడం హరికుమార్ రెడ్డి, రాంపురం ఈశ్వర్ రెడ్డి,సునీల్ రెడ్డి,ఆనంద్ సాగర్, పాతపల్లి చంద్రశేఖర్,గుమ్మడం తాండ రాజు నాయక్ తిప్పాయిపల్లి నవీన్ గౌడ్,బోయ బాలరాజు నరేష్,తదితరులు పాల్గొన్నారు.